Arjuna Phalguna: అభిమన్యుడు కాదు అర్జునుడు

అప్పుడప్పుడే డిగ్రీ పూర్తి చేసుకున్న కుర్రాళ్లు ఆ నలుగురు. ‘డిగ్రీదాకా చదివాం. ఒక ఆర్నెళ్లు విశ్రాంతి తీసుకుంటే తప్పా?’ అంటూ స్నేహితులంతా కలిసి సరదాగా తిరుగుతూ జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు. అంతలోనే వాళ్లని ఊహించని ప్రమాదం...

Updated : 25 Dec 2021 09:29 IST

ప్పుడప్పుడే డిగ్రీ పూర్తి చేసుకున్న కుర్రాళ్లు ఆ నలుగురు. ‘డిగ్రీదాకా చదివాం. ఒక ఆర్నెళ్లు విశ్రాంతి తీసుకుంటే తప్పా?’ అంటూ స్నేహితులంతా కలిసి సరదాగా తిరుగుతూ జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు. అంతలోనే వాళ్లని ఊహించని ప్రమాదం చుట్టుముట్టింది. అది తప్పు వల్లో, పొరపాటు వల్లో జరిగింది కాదు. ఓ నేరంతో ముడిపడిన ప్రమాదం. పద్మవ్యూహంలో ఇరుక్కుపోయినట్టుగా చేసిన ఆ నేరం ఎవరిది? దాని పర్యవసనాలు ఎలాంటివి? అభిమన్యుడిలా బలైపోకుండా అర్జునుడిలా పోరాడి గెలిచిన ఆ గ్యాంగ్‌ కథేమిటో తెలియాలంటే ‘అర్జున ఫల్గుణ’ చూడాల్సిందే. శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించారు. అమృతా అయ్యర్‌ కథానాయిక. తేజ మర్ని దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 31న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఆది, సింహాద్రి, రాఖీ, యమదొంగ అనే నలుగురు పల్లెటూరు కుర్రాళ్లు, నేర నేపథ్యం ప్రధానంగా సాగే కథతో చిత్రం రూపొందుతోందని ట్రైలర్‌ని బట్టి స్పష్టమవుతోంది. ‘‘ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తూ సాగే చిత్రమిది. శ్రీవిష్ణుతోపాటు, అమృత అయ్యర్‌, సుబ్బరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జగదీష్‌ చీకటి కెమెరా పనితనం, ప్రియదర్శన్‌ నేపథ్య సంగీతం కట్టిపడేస్తుంద’ని సినీ వర్గాలు తెలిపాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని