Amitabh Bachchan: అమితాబ్‌కి పేరు ఎవరు పెట్టారో తెలుసా?

ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌కి ఈ పేరు ఎవరు పెట్టారు?  ‘తన తండ్రి’ లేదా ‘తన తల్లి’ అంటూ సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారా!

Updated : 15 Sep 2021 06:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌కి పేరు ఎవరు పెట్టారు? ‘తన తండ్రి’ లేదా ‘తన తల్లి’ అంటూ సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారా! అలా అనుకుంటే మీరు పొరపడినట్లే. అమితాబ్‌ అని ‘బిగ్‌ బీ’కి నామకరణం చేసింది తన తండ్రి కాదు, తన తల్లీ కాదు. ఇంకెవరంటారా... ఎవరో కాదు ప్రముఖ కవి, దివంగత సుమిత్రా నందన్‌ పంత్‌. అమితాబ్ తండ్రి హరివంశరాయ్‌ బచ్చన్‌, సుమిత్రా నందన్‌ మంచి స్నేహితులు. ప్రత్యేక సందర్భాల్లో ఒకరింటికి ఒకరు వెళ్లి, ఆనందాన్ని పంచుకునేవారు. అలా అమితాబ్‌ నామకరణ వేడుకకి సుమిత్రా నందన్‌ విచ్చేశారు. ఆ సమయంలో శిశువు ముఖాన్ని తీక్షణంగా చూసిన సుమిత్రా నందన్‌ ‘అమితాబ్‌’ అనే పేరు ఖరారు చేశారు. ఆయన మాట ప్రకారమే హరివంశరాయ్‌ తన తనయుడ్ని అమితాబ్‌ చేశారు. స్వయంగా అమితాబ్‌ బచ్చనే ఈ విషయాన్ని పంచుకున్నారు. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కౌన్‌ బనేగా క్రోర్‌పతి 13’ కార్యక్రమం వేదికగా తెలియజేశారు. తన తండ్రి కలం పేరే (బచ్చన్‌) ఇంటి పేరుగా మారిందని అమితాబ్‌ గతంలో వ్యక్తిగత బ్లాగ్‌లో రాసిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని