BiggBoss 5: సిరి ఎలిమినేషన్‌.. జరిగిందదే: ముగిసిన ఓటింగ్‌

బిగ్‌బాస్‌ సీజన్‌-5 (Bigg boss) ముగింపు దశకు వచ్చినా ఇతర ఇంటిసభ్యులపై షణ్ముఖ్‌(shanmukh) అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. గురువారం సన్నీతో జరిగిన గొడవ కారణంగా సిరి (Siri) బాత్‌రూమ్‌లో కూర్చొని...

Updated : 18 Dec 2021 09:02 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-5 (Bigg boss) ముగింపు దశకు వచ్చినా ఇతర ఇంటిసభ్యులపై షణ్ముఖ్‌(shanmukh) అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. గురువారం సన్నీతో జరిగిన గొడవ కారణంగా సిరి (Siri) బాత్‌రూమ్‌లో కూర్చొని ఏడ్చింది. అక్కడికి వచ్చిన షణ్ముఖ్‌.. సిరిపై చిరాకు పడ్డాడు. ‘‘వాడు తిట్టినా ఏడుస్తావ్‌. నేను తిట్టినా ఏడుస్తావ్‌. ఇలా ప్రతిదానికి ఏడిస్తే అర్థమేముంది?ఎవడో ఏదో అన్నాడని ఇలా చేయడం బాలేదు’’ అని సిరిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ‘‘కొట్టడానికి మీదకు వస్తున్నాడురా. ఏం చేయాలి?’’ అని సిరి అనగా.. ‘‘వాళ్లకు అంత సీన్ లేదు. ఎవర్రా నిన్ను కొట్టేది. నాలుగు క్లోజప్‌ షాట్స్‌ పడతాయని ఓవరాక్షన్‌ చేస్తున్నాడంతే’’ అని షణ్ముఖ్‌ అన్నాడు. అప్పటికే గార్డెన్‌ ఏరియాలో కూర్చొన్న సన్నీ-మానస్‌ వీళ్ల మాటలు విన్నారు. ‘‘చూడురా.. ఇదే రెచ్చగొట్టే మాటలు అంటే’’ అని సన్నీ (Sunny) అనగా.. ‘‘నీ పేరు చెప్పలేదు కదరా. నీకెందుకు’’ అని మానస్‌ (Manas) సన్నీకి సద్దిచెప్పాడు.

మరుసటి రోజు ఉదయం హౌస్‌మేట్స్ కోసం సిరి టిఫిన్‌ చేయగా అందుక్కూడా షణ్ముఖ్‌ మండిపడ్డాడు. ‘‘నిన్ను కార్నర్‌ చేస్తూ, నీ మీద కోప్పడే వాళ్ల కోసం టిఫిన్‌ ఎందుకు చేస్తున్నావ్‌? నీది నువ్వు చేసుకోవచ్చు కదా’’ అని కేకలు పెట్టాడు. ‘‘అందరూ తింటారనే ఉద్దేశంతోనే టిఫిన్‌ చేశా’’నని సిరి చెప్పినా షణ్ముఖ్‌ అవేమీ పట్టించుకోలేదు. తాను వేసిన దోశెలు తినలేదని తెలిసిన సిరి, గార్డెన్‌ ఏరియాకు వచ్చి ‘‘ఎందుకు తినలేదు’’ అంటూ మానస్‌ని అడిగింది. తాను ఒకటి తిన్నానని, సన్నీనే తినలేదని మానస్‌ జవాబులిచ్చాడు.

సిరి ఎలిమినేట్‌ అంటూ బిగ్‌బాస్‌ ప్రకటన..:

ఇంటిసభ్యులందరూ తమ బట్టలు సర్దుకుని గార్డెన్‌ ఏరియాకు రమ్మని బిగ్‌బాస్‌(bigg boss) ఆదేశించాడు. ‘ఈ ఇంట్లో మీలో ఒకరి ప్రయాణం ఈ క్షణమే ముగుస్తుంది. బిగ్‌బాస్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లే ఆ ఒక్కరు ఎవరని మీరు అనుకుంటున్నారు’ అని అడిగాడు. ‘నా అభిప్రాయం ప్రకారం షణ్ముఖ్‌(shanmukh).. ఊహాగానాలు చాలా ఎక్కువ చేస్తున్నాడు’ అని మానస్‌(Manas) అనగా, మిగతా వాళ్లతో పెద్దగా గొడవలు కాలేదంటూ సన్నీ(sunny) పేరును షణ్ముఖ్ సూచించాడు. ‘హౌస్‌మేట్స్‌ అనగానే ఒకరితో ఒకరికి ఇంటరాక్షన్‌ ముఖ్యం. ఉన్న నలుగురిలో సిరితో నాకు ఇంటరాక్షన్‌ తక్కువ. కాబట్టి ఆమెనే అనుకుంటున్నా’ అని శ్రీరామ్‌(sri ram) అన్నాడు. ఇక సన్నీ.. షణ్ముఖ్‌ పేరును సూచించాడు. అందరి అభిప్రాయాలు విన్న బిగ్‌బాస్‌ ఇంటి నుంచి బయటకు వెళ్తున్న వ్యక్తి ‘సిరి’ అని చెప్పాడు. దీంతో సిరి కంగుతింది. తాను ఇంటి నుంచి బయటకు వెళ్లనని అంది. డోర్లు ఓపెన్‌ చేయడంతో షణ్ముఖ్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. సిరిని పట్టుకుని ఏడ్చాడు. సిరి కూడా ‘‘ఐ మిస్‌ యూ’’ అంటూ షణ్ముఖ్‌ని హత్తుకుని కన్నీటి పర్యంతమైంది. ఆ తర్వాత సిరికి కళ్లకు గంతలు కట్టి కన్ఫెషన్‌ రూమ్‌లోకి తీసుకెళ్లారు. ఎలిమినేట్‌ కాకుండా కన్ఫెషన్‌ రూమ్‌లో పెట్టినందుకు ఆమె సంతోషపడుతుంటే.. మరోవైపు షణ్ముఖ్‌ బాధపడుతూ కనిపించాడు. ‘‘బిగ్‌బాస్‌ వాడు తట్టుకోలేడు. నన్ను ఇంటిలోకి పంపించేయండి ప్లీజ్‌. వాడు ఎవరితోనూ ఏమీ చెప్పుకోలేడు. ప్లీజ్‌ బిగ్‌బాస్‌ పంపించండి’’ అని సిరి అనగా సమయం వచ్చినప్పుడు తప్పకుండా హౌస్‌లోకి పంపుతానని బిగ్‌బాస్ అన్నాడు. ఆ తర్వాత కొంతసేపటికే సిరిని హౌస్‌లోకి పంపించాడు. సిరి రావడంతో షణ్ముఖ్‌ ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయాడు. ఫినాలేకు మరో రోజే ఉండటంతో గత సీజన్‌ కంటెస్టెంట్స్‌ వచ్చి సందడి చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారంతో ఓటింగ్‌ లైన్స్‌ అన్నీ ముగిశాయి. బిగ్‌బాస్‌ సీజన్‌ ఫైవ్ విన్నర్‌ ఎవరో ప్రేక్షకుల ఓట్లతో డిసైడ్‌ అయిపోయినట్టే..!

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని