Cinema News: జిల్ జిల్ జిగా.. జిగా
కథానాయిక అంటేనే గ్లామర్. గ్లామర్ అంటేనే కథానాయిక. ఇద్దరు ముగ్గురు కథానాయికల గ్లామర్‌ని కోరుకునే కథలు కూడా కొన్ని ఉంటాయి. అలాంటప్పుడే... చిన్నదో వైపు, పెద్దదో వైపు అంటూ
కథానాయిక అంటేనే గ్లామర్. గ్లామర్ అంటేనే కథానాయిక. ఇద్దరు ముగ్గురు కథానాయికల గ్లామర్‌ని కోరుకునే కథలు కూడా కొన్ని ఉంటాయి. అలాంటప్పుడే... చిన్నదో వైపు, పెద్దదో వైపు అంటూ ఆడిపాడుతుంటాడు హీరో. అయితే కథానాయికలు ఎంతమంది ఉన్నా... మధ్యలో జిగేల్ రాణి వచ్చి వెళితే కానీ ఆ కథకి ఊపు రాదు, కథానాయకుడికీ ఉత్సాహం రాదు. అంతకంటే కూడా చూసే మాస్ ప్రేక్షకుడికీ సినిమా ఆస్వాదన పరిపూర్ణం కాదు. అందుకే దర్శకులు కథ మధ్యలో ఓ ప్రత్యేక గీతానికి చోటిచ్చి.. ప్రత్యేక భామల్ని రంగంలోకి దించుతుంటారు. ఆ పాటలు సినిమాలకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ఒకప్పుడు ఆ పాటల్లో ఐటెమ్ భామలుగా పేరు పడ్డ అందగత్తెలే సందడి చేసేవారు. కథానాయికలు కూడా ఆడిపాడటం మొదలయ్యాక ఎప్పటికప్పుడు కొత్త జిగేల్ రాణీల జాబితా పుట్టుకొచ్చేస్తోంది. తాజాగా ఆ జాబితాలో సమంత, ఫరియా అబ్దుల్లా, రష్మీ తదితరులు చేరారు.
ప్రత్యేక గీతానికి చాలా ప్రత్యేకతే ఉంటుంది కొన్నిసార్లు ఆ ఒక్క పాటే ప్రేక్షకుడిని థియేటర్ వరకు తీసుకొస్తుంటుంది. అందుకే దర్శకనిర్మాతలు దానికి మరిన్ని హంగులు జోడించడం మొదలుపెట్టారు. కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చి అగ్ర కథానాయికలతో ఆ పాటల్ని చేయిస్తున్నారు. కోట్ల రూపాయలతో సెట్స్ వేసి వాటిని తెరకెక్కిస్తున్నారు. ఆ పాట కోసం ప్రత్యేకమైన కసరత్తులే జరుగుతుంటాయి. ‘రంగస్థలం’ సినిమాలో అగ్ర కథానాయిక పూజాహెగ్డే జిగేల్ రాణిగా ఊపేసింది. ఈసారి మరో అగ్ర కథానాయిక సమంతని తన చిత్రం ‘పుష్ప’ కోసం ఎంపిక చేశారు సుకుమార్. ప్రస్తుతం రామోజీఫిల్మ్‌సిటీలో భారీ హంగుల నేపథ్యంలో ఆమెపై పాటని తెరకెక్కించారు. సమంత చేసిన తొలి ప్రత్యేకగీతం ఇదే. మరి ఆ పాట ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.
బంగార్రాజు పాట
నాగార్జున సినిమా ‘బంగార్రాజు’లో కూడా ప్రత్యేక గ్లామర్ కూసింత ఎక్కువే ఉండబోతోంది. లడ్డుండ..అనే పాటలో పలువురు నాయికలు కనిపిస్తారు. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతం కూడా ఉంటుందట. ఆ పాటలో ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఆడిపాడుతోందని తెలుస్తోంది. మరి ఈ కుర్రభామ ఫరియాతో కలిసి నాగార్జున ఆడిపాడారా లేక ఆయన తనయుడు నాగచైతన్యనా అనేది తెలియాల్సి ఉంది. ‘బంగార్రాజు’లో యువ మన్మథుడుగా నాగచైతన్య నటిస్తున్న సంగతి తెలిసిందే.
భోళా... అందం భళా
బుల్లితెరపై సందడి చేస్తూ ఇంటింటికీ చేరువైన భామ రష్మికి చిరంజీవితో ఆడిపాడే అవకాశం దక్కింది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ‘భోళా శంకర్’లో ఓ ప్రత్యేక గీతం ఉంటుందట. ఆ పాట కోసం రష్మిని ఎంపిక చేశారు. ప్రత్యేక గీతాల కోసమే కాదు, అదనపు అందం జోడించాలనే ప్రయత్నంలో కూడా కొంతమంది కథానాయికల్ని ఎంపిక చేసుకుంటుంటారు. ‘ఎఫ్3’కి ప్రత్యేక అందాన్ని జోడించడం కోసం సోనాల్ చౌహాన్ని ఎంపిక చేశారు. ఆమె పాత్ర సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అందులో తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటికే ‘రెడ్’ సినిమాలో డించక్ డించక్ అంటూ హెబ్బా పటేల్, భూమ్ బద్దల్ అంటూ ‘క్రాక్’లో, పెప్సీ ఆంటీ అంటూ ‘గోలీమార్’లో అప్సరారాణి, ‘చావు కబురు చల్లగా’లో అనసూయ ప్రత్యేక అందాన్ని ఒలికించిన విషయం తెలిసిందే. రాబోయే ప్రత్యేక గీతాలు సినీ ప్రేక్షకుడిలో మరిన్ని అంచనాల్ని రేకెత్తిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామ్ చరణ్ బర్త్‌డే.. ఆయన బాల్యం గురించి ఈ విశేషాలు తెలుసా..?
టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు.. -
Challenging Roles: పాత్రలకు ప్రాణం పోశారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలా.. విక్రమ్ అలా!
పాత్రలకు ప్రాణం పోసేందుకు మానసికంగా, శారీరకంగా ఎంతగానో శ్రమించిన నటులు, వారి సినిమాల వివరాలివీ.. -
Tollywood Actresses: అగ్ర నాయికలు అలా రూటు మార్చి.. హాట్‌టాపిక్‌గా నిలిచి!
అగ్ర కథానాయిక- వర్ధమాన హీరో కాంబినేషన్లో వచ్చిన సినిమాల విశేషాలు.. -
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
స్వీయ దర్శకత్వంలో నటించిన హీరో/హీరోయిన్‌పై ప్రత్యేక కథనం. ఎవరు ఏ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారంటే? -
Alia Bhatt: అందుకు క్లాస్‌లో బెంచీలు తుడిచి.. బ్యాగ్రౌండ్ ఉన్నా ఆడిషన్ ఇచ్చి: అలియా భట్ బర్త్‌డే స్పెషల్
అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు విశేషాలు.. -
Mamitha Baiju: గిరిజ, సాయి పల్లవిలా మమితా బైజు.. రాజమౌళి మెచ్చిన ఈ నటి ఎవరు?
యంగ్ హీరోయిన్ మమితా బైజును అగ్ర దర్శకుడు ప్రశంసించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎవరీ నటి? -
Comedians as Heros: కమెడియన్లు.. కథానాయకులై.. ఎవరెవరు ఏ సినిమాతో అలరించారంటే?
కమెడియన్లుగా కెరీర్‌ని ప్రారంభించి హీరోగాను సినిమాలు చేస్తున్న నటులపై ప్రత్యేక కథనం.. -
Krystyna Pyszkova: మనిషే కాదు.. మనసూ అందమే: మిస్ వరల్డ్ క్రిస్టినా గురించి ఆసక్తికర విశేషాలివీ
ప్రపంచ సుందరి-2024 కిరీటం దక్కించుకున్న క్రిస్టినా పిస్కోవా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
Miss World Pageant: తొలుత ‘బికినీ కాంటెస్ట్’గా.. 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం.. ‘మిస్ వరల్డ్’ పోటీల సంగతులివీ!
భారత్ ఆతిథ్యంలో 71వ ఎడిషన్ ‘మిస్ వరల్డ్’ పోటీలు జరుగుతున్నాయి. శనివారం విజేతను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఈ అందాల పోటీల గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Sini Shetty: మిస్ వరల్డ్ పోటీలు.. ‘బెస్ట్ డిజైనర్ డ్రెస్’ విజేతగా సినిశెట్టి
మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Movies in March: మార్చిలో మురిపించే చిత్రాలు.. వరుణ్ తేజ్ అలా.. ‘టిల్లు’ ఇలా!
మార్చిలో విడుదల కానున్న సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ హీరో చిత్రం ఏ రోజు ప్రేక్షకుల ముందుకు రానుందంటే? -
Valentine Day: వాలంటైన్స్ డేకు రీరిలీజ్ కానున్న ప్రేమకథా చిత్రాలివే..
వాలంటైన్స్ డే సందర్భంగా గతంలో అలరించిన ప్రేమ కథాచిత్రాలు మరోసారి వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. -
తొలి సినిమా ఫ్లాప్.. ‘బండమొహం వీడేం హీరో’ అన్నారు.. రీల్ కెరీర్ To పొలిటికల్ ఎంట్రీ.. విజయ్ లైఫ్ జర్నీ ఇదే!
Actor vijay: తల్లిదండ్రులకు సినీ నేపథ్యం ఉన్నా, నటుడిగా తనకంటూ తమిళనాట గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ ఆయన లైఫ్ జర్నీ ఎలా సాగింది? -
Jeethu Joseph: 17 సినిమాలు.. మూడే ఫ్లాప్‌లు.. చైనీస్, ఇండోనేషియా, కొరియాలోనూ రీమేక్ అయిన మొదటి భారతీయ సినిమా ఆయనదే!
Jeethu Joseph: మోహన్‌లాల్ కథానాయకుడిగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ‘నెరు’ ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో జీతూ గురించి ఆసక్తికర విషయాలు.. -
Chiranjeevi: ఆ అవమానమే.. సుప్రీం హీరోను మెగాస్టార్ చేసింది: పద్మ విభూషణ్ చిరంజీవి ప్రయాణమిది!
ప్రముఖ నటుడు చిరంజీవికి అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘పద్మ విభూషణ్’ అవార్డు వరించింది. ఈ సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం.. -
Salaar Part 2: ఈ ప్రశ్నలకు సమాధానం... ‘సలార్-2: శౌర్యాంగ పర్వం’ చెబుతుంది!
‘సలార్’ పార్ట్-1 చూసిన వారందరూ ఇప్పుడు పార్ట్-2 ‘శౌర్యాంగ పర్వం’ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ భాగంలో ఏయే ప్రశ్నలకు సమాధానం లభించనుంది? -
Telugu Movies: రిపబ్లిక్ డే ‘డబ్బింగ్’ చిత్రాలదే.. ఆ రోజు ‘ఈగల్’ సింగిల్‌గా..?
రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలకానున్న చిత్రాలు, ఫిబ్రవరి రెండో వారంలో రాబోతున్న సినిమాలపై ప్రత్యేక కథనం.. -
Hombale Films: ఆ పరాజయం.. ‘కేజీయఫ్’, ‘సలార్’ హిట్లకు కారణమైంది: హోంబలే ప్రయాణమిదీ
ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’కు ఆ పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఆ బ్యానర్‌పై వచ్చిన సినిమాల వివరాలివీ.. -
Pallavi prashanth: ‘బిగ్‌బాస్’కు వెళ్తానంటే ఎగతాళి చేశారు.. ‘విన్నర్’గా నిలిచిన ‘రైతుబిడ్డ’ జర్నీ ఇదీ!
bigg boss 7 telugu winner pallavi prashanth: ఫోక్ సాంగ్స్ క్రియేటర్‌గా జీవితాన్ని మొదలు పెట్టిన పల్లవి ప్రశాంత్ లైఫ్ జర్నీ సాగిందిలా..! -
Bollywood Roundup: రీమేక్స్‌తో డీలా.. షారుక్ సినిమాలతో కొత్త కళ: బాలీవుడ్ తీరిలా!
ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ చిత్రం హిట్? ఏది ఫట్? చూసేయండి.. -
Venkatesh: అద్దమే ఫిల్మ్‌స్కూల్.. హోస్ట్‌గా ఆ షోస్‌కు ‘నో’: వెంకటేశ్ గురించి ఈ విశేషాలు తెలుసా?
ప్రముఖ హీరో వెంకటేశ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సినిమాల గురించి పలు ఆసక్తికర సంగతులు చూద్దాం..
తాజా వార్తలు (Latest News)
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్‌నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్‌ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత