Updated : 08/12/2021 07:20 IST

Vikranth Rona: ‘విక్రాంత్‌ రోణ’.. వచ్చేది ఆరోజే

న్నడ స్టార్‌ కిచ్చా సుదీప్‌ ప్రధాన పాత్రలో అనూప్‌ భండారి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘విక్రాంత్‌ రోణ’. జీస్టూడియోస్‌, కిచ్చా క్రియేషన్స్‌, షాలినీ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. నిరూప్‌ భండారి, నీతా అశోక్‌, జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ కీలక పాత్రలు పోషించారు. త్రీడీలో రూపొందించిన ఈ మిస్టరీ థ్రిల్లర్‌ సినిమాని.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం విడుదల తేదీతో ఓ పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా  దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రపంచానికి ఓ సరికొత్త సూపర్‌ హీరోను పరిచయం చేస్తున్నాం. త్రీడీ టెక్నాలజీతో రూపొందించిన ఈ సినిమాని వెండితెరపైనే  ఆస్వాదించాలి. పిల్లలు, పెద్దలకి మంచి విజువల్‌ ట్రీట్‌గా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఆసక్తికర కథాంశంతో మిస్టరీ థ్రిల్లర్‌గా సినిమాని రూపొందించాం. ఇలాంటి విభిన్నమైన చిత్రాలను ప్రేక్షకులు కచ్చితంగా ప్రోత్సహిస్తారు. అందుకే వారిపై నమ్మకంతోనే దీన్ని త్రీడీలో తెరకెక్కించామ’’న్నారు నిర్మాతల్లో ఒకరైన జాక్‌ మంజునాథ్‌. ఈ సినిమాకి సంగీతం: బి.అజనీష్‌ లోక్‌నాథ్‌, ఛాయాగ్రహణం: విలియమ్‌ డేవిడ్‌.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని