రష్మి ప్రేమ కోసం మళ్లీ జన్మిస్తా : సుధీర్‌

రష్మి ప్రేమ కోసం మరలా జన్మిస్తా అంటున్నారు నటుడు సుడిగాలి సుధీర్. బుల్లితెర వేదికగా ప్రసారమయ్యే ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’, ‘ఢీ’ ప్రోగ్రామ్‌లతో ఈ జోడీ ప్రతి ఒక్కరికీ సుపరిచితులే......

Updated : 16 Jul 2021 10:50 IST

మరోసారి ఆకట్టుకున్న బుల్లితెర జోడీ

హైదరాబాద్‌: రష్మి ప్రేమ కోసం మళ్లీ జన్మిస్తా అంటున్నారు నటుడు సుడిగాలి సుధీర్. బుల్లితెర వేదికగా ప్రసారమయ్యే ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’, ‘ఢీ’ ప్రోగ్రామ్‌లతో ఈ జోడీ ప్రతి ఒక్కరికీ పరిచయమే. తాజాగా ఈ జోడీ మరోసారి ఫిదా చేసింది. అనసూయ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న ‘జబర్దస్త్‌’ షోలో వీళ్లిద్దరూ తళుక్కున మెరిశారు.

హైపర్‌ ఆది స్కిట్‌లో ‘జబర్దస్త్‌’ స్టేజ్‌పై సుధీర్‌-రష్మి సందడి చేశారు. తాజాగా ప్రసారమైన ఈ ఎపిసోడ్‌లో ఆది-దీపిక, సుధీర్‌-రష్మిల వివాహాన్ని సరదాగా స్కిట్‌ రూపంలో చూపించారు. ఇందులో రష్మి.. ‘సుధీర్‌.. ఒకవేళ నేను ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే ఏం చేసేవాడివి’ అని ప్రశ్నించగా.. ‘నీ ప్రేమ కోసం వందసార్లు మరణించైనా ఒక్కసారి జన్మిస్తాను. ఆ సూర్యరశ్మి ఉన్నంత కాలం ఈ సుధీర్‌-రష్మి ఉంటారు’ అని సమాధానమిస్తాడు. దీంతో రష్మి సిగ్గుపడుతూ చిరునవ్వులు పూయించింది. ‘ఇదిగో రష్మి.. నువ్వు ఆ ఓలేటి లక్ష్మిలా వయ్యారాలుపోమాకు. సూర్యరశ్మి అంటే పగలే ఉంటుంది. మరి, వీడు రాత్రి ఎక్కడ ఉంటాడో అది అడుగు’ అంటూ ఆది వేసిన కౌంటర్‌కు ప్రతి ఒక్కరూ పగలబడి నవ్వారు. మరి, ఆది-దీపిక, సుధీర్‌-రష్మిల పెళ్లి వేడుక ఎలా జరిగిందో మీరూ చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని