Sudheer Rashmi: సుధీర్‌- రష్మి.. తమ పెళ్లి గురించి ఏం చెప్పారంటే?

బుల్లితెర హిట్‌ పెయిర్‌ సుధీర్‌, రష్మిల పరిచయానికి తొమ్మిదేళ్లు. ఈ సందర్భంగా తొమ్మిది అపురూప కానుకలతో రష్మి సుధీర్‌ని సర్‌ప్రైజ్‌ చేసింది.

Updated : 17 Aug 2022 10:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బుల్లితెర హిట్‌ పెయిర్‌ సుధీర్‌, రష్మిల పరిచయానికి తొమ్మిదేళ్లు. ఈ సందర్భంగా తొమ్మిది అపురూప కానుకలతో రష్మి సుధీర్‌ని సర్‌ప్రైజ్‌ చేసింది. తన ప్రేమని తెలియజేసింది. ‘ఊరిలో వినాయకుడు’ కార్యక్రమం ఇందుకు వేదికైంది. సుధీర్‌, రష్మి వ్యాఖ్యాతలుగా ఈ ప్రత్యేక షో రూపొందింది. వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 10న ఈటీవీలో ప్రసారంకానుంది. దానికి సంబంధించి ప్రోమో విడుదలైంది. 

నటులు శ్రీకాంత్‌, ఇంద్రజ, రోజా, పూర్ణ అతిథులుగా మెరిశారు. ‘జబర్దస్త్‌’ నటులు వినాయక చవితి చందా వసూలు చేస్తూ, నవ్వులు పూయించారు. ఓ సందర్భంలో నటుడు ఆది భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకుంటారు. ‘9 ఇయర్స్‌ ఆఫ్‌ సుధీర్ అండ్‌ రష్మి లవ్‌ స్టోరీ’ స్కిట్‌తో సుధీర్‌, ఆది ఆకట్టుకుంటున్నారు. ‘9 సంవత్సరాల తీపి గుర్తుల్ని 9 గిఫ్ట్‌లుగా నీకు గుర్తుండిపోయేలా ఇస్తున్నా’ అని రష్మి సుధీర్‌ని సర్‌ప్రైజ్‌ చేసింది. ఓ ప్రేమ పాటకి డ్యాన్సు చేస్తూ సుధీర్‌పై ఉన్న ప్రేమని తెలియజేసింది. ‘మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలనేది ప్రతి ఒక్కరి కోరిక’ అని రోజా తన మనసులో మాట చెప్పారు. ‘మీ నుంచి మేం ఆశించేంది ఓకే, ఎస్‌ అనే సమాధానాలు. మీ నిర్ణయం కావాలి మాకు’ అని ఇంద్రజ అనగానే ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. ఆ సమాధానం తెలిసేలోపే ప్రోమో ముగిసింది. మరి తమ పెళ్లి గురించి సుధీర్‌, రష్మి సమాధానం ఏంటి? ఆది ఎందుకు ఏడ్చారు? తెలియాలంటే శుక్రవారం వరకు వేచి చూడాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని