Cinema News: చిత్తం.. మహారాణి

యజుర్వేద్‌, రచన జంటగా ఎ.కాశీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘చిత్తం మహారాణి’. జెఎస్‌. మణికంఠ, టిఆర్‌. ప్రసాద్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సునీల్‌, హర్ష వర్ధన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు

Updated : 15 Nov 2021 07:24 IST

జుర్వేద్‌, రచన జంటగా ఎ.కాశీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘చిత్తం మహారాణి’. జెఎస్‌. మణికంఠ, టిఆర్‌. ప్రసాద్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సునీల్‌, హర్ష వర్ధన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు సుకుమార్‌ ఆదివారం విడుదల చేశారు. ‘‘సరికొత్త ప్రేమ కథతో.. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సునీల్‌ ఓ కీలక పాత్రలో సందడి చేయనున్నారు. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి గౌర హరి స్వరాలందిస్తుండగా.. విశ్వనాథ్‌ రెడ్డి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని