Skylab: రిపోర్టర్‌గా మారిన సుమ.. సత్య, నిత్యలతో ‘స్పైసీ న్యూస్‌’! 

నిత్యామేనన్‌, సత్యదేవ్‌, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘స్కైలాబ్‌’. విశ్వక్‌ ఖండేరావు దర్శకత్వం వహించారు.

Published : 03 Dec 2021 23:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నిత్యామేనన్‌, సత్యదేవ్‌, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘స్కైలాబ్‌’. విశ్వక్‌ ఖండేరావు దర్శకత్వం వహించారు. పృథ్వీ పిన్నమరాజుతోపాటు నిత్యా మేనన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. బండ లింగంపల్లిపై ‘స్కైలాబ్‌’ అనే అంతరిక్ష నౌక పడుతుందనే విషయం తెలిశాక ఏం జరిగింది? అక్కడ ఉండేవారి జీవితాలు ఎలాంటి మలుపు తీసుకున్నాయి? అనే కథాంశంతో ఈ చిత్రం డిసెంబర్‌ 4న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వ్యాఖ్యాత సుమ రిపోర్టర్‌గా మారి సత్య, నిత్యలతో సందడి చేశారు. ‘స్పైసీ న్యూస్‌’ పేరుతో ఎన్నో నవ్వుల్ని పంచారు.

* ఈ సినిమాని మీరు చూశారా?

సత్య: మా దర్శకుడు ఈ సినిమాని ప్రేక్షకులకు తప్ప మాకు చూపించనన్నారు.

* ఏ సినిమా తర్వాత మీ రెమ్యునరేషన్‌ పెంచారు?

నిత్య: నేనెప్పుడూ రెమ్యునరేషన్‌ పెంచలేదు. ‘నువ్వు తీసుకునేది ఇంతేనా. ఎక్కువ అగడవచ్చు కదా’ అని నాకు చాలామంది చెప్పారు. కానీ, నేను దాని గురించి ఆలోచించలేదు.

సత్య: ఇప్పటి వరకూ పెంచలేదు. ‘స్కైలాబ్‌’ తర్వాత పెంచాలనుకుంటున్నా.

* మీరు పోషించిన పాత్రల్లో మీకు నచ్చనిది?

సత్య: నచ్చనవి అంటూ ఏంలేవు. అన్నీ నాకు ఇష్టమైన పాత్రలే.

నిత్య: చాలా ఉన్నాయి. కానీ, చెప్పను.

* టెన్షన్‌లో ఉన్నప్పుడు మీరేం పనులు చేస్తుంటారు?

నిత్య: నేను టెన్షన్‌లో ఉన్నప్పుడు నా చేతిగోళ్లు కొరుకుతా.

సత్య: ఒత్తిడిని తగ్గించుకునేందుకు నేను ఎక్కువగా తింటుంటా.

* నటన, నిర్మాణ బాధ్యతలు ఈ రెండిటిలో ఏది తేలిక అనిపించింది?

నిత్య: నటన.. క్రియేటివ్‌ జాబ్‌. స్వతహాగా నేను క్రియేటివ్‌ పర్సన్‌ని కాబట్టి నటించటం తేలికనిపిస్తుంటుంది. నిర్మాత అంటే ఎన్నో వ్యవహారాల్ని చూసుకోవాలి. అది చాలా కష్టం.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని