Malli Modalaindi: ఆకట్టుకునేలా ‘మళ్ళీ మొదలైంది’ ట్రైలర్‌

‘మళ్ళీరావా’ వంటి లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల్ని అలరించిన సుమంత్‌ ఇప్పుడు మరోసారి అదే జోనర్‌ చిత్రంతో విజయం అందుకునేందుకు సిద్ధమయ్యారు....

Published : 28 Oct 2021 16:03 IST

హైదరాబాద్‌: ‘మళ్ళీరావా’ వంటి లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల్ని అలరించిన సుమంత్‌ ఇప్పుడు మరోసారి అదే జోనర్‌ చిత్రంతో విజయం అందుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మళ్ళీ మొదలైంది’. టీజీ కీర్తి కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుమంత్‌కు జోడీగా నైనా గంగూలీ కనిపించనున్నారు. నటి వర్షిణి కీలకపాత్ర పోషిస్తున్నారు. కాగా, తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు నిఖిల్‌ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. ‘‘కొన్ని పెళ్లిళ్లకు విడాకులే ముగింపు. అలాగే, కొన్ని విడాకులకు ముగింపు..’’ అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల పరస్పర అంగీకారంతో విడిపోయిన భార్యాభర్తలుగా సుమంత్‌-వర్షిణి, పవిత్ర అనే లాయర్‌గా నైనా గంగూలీ నటన ఆకట్టుకునేలా ఉంది.  ‘‘ఏదో ఒకరోజు తప్పకుండా ఓ ముఖ్యమైన వ్యక్తి నీ లైఫ్‌లోకి వస్తారని అంటారు. పవిత్రని చూసినప్పుడు నాకు అలాగే అనిపించింది’’ అంటూ సుమంత్‌ చెప్పే డైలాగ్‌లు మెప్పించేలా ఉన్నాయి. విడాకుల అనంతరం హీరో.. మళ్ళీ ప్రేమలో పడితే..?ఆ ప్రేమ ఎటువైపుకు దారి తీసింది? అనే ఆసక్తికర విషయాలను మరింత ఆసక్తికరంగా ఈసినిమాలో చూపించారు. సుహాసిని, మంజుల, పృథ్వీరాజ్‌, వెన్నెల కిషోర్‌, అన్నపూర్ణ, పోసాని మురళీ కృష్ణ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని