Bigg boss Telugu 5: కన్నింగ్‌ కాజల్‌.. ఫేక్‌ రవి.. డబుల్‌ ఫేస్‌ సిరి..!

బిగ్‌బాస్‌ హౌస్‌లో వీకెండో ఎంతో హుషారుగా జరిగింది. సండే ఫుల్‌ ఫన్‌ డే కావడంతో ఇంటి సభ్యులందరికీ నాగార్జున స్పెషల్‌ టాస్క్‌లిచ్చి..

Updated : 14 Nov 2021 16:56 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ హౌస్‌లో వీకెండో ఎంతో హుషారుగా జరిగింది. సండే ఫుల్‌ ఫన్‌ డే కావడంతో ఇంటి సభ్యులందరికీ నాగార్జున స్పెషల్‌ టాస్క్‌లిచ్చి.. ఒక ఆట ఆడుకున్నారు. ఇందులో భాగంగా, ఓ టాస్క్‌లో ఓడిపోయిన రవి చేత నాగ్‌ గోడకుర్చీ వేయించారు. అనంతరం మరో టాస్క్‌లో భాగంగా కొంతమంది సెలబ్రిటీల చిన్నప్పటి ఫొటోలు చూపించి అందులో ఉన్న స్టార్‌ ఎవరో చెప్పాలని నాగ్‌ కోరారు. ఈ క్రమంలో.. టాస్క్‌ ఆడేందుకు వచ్చిన ప్రియాంక-రవిలకు మహేశ్‌ చిన్ననాటి ఫొటో చూపించారు. ఆ ఫొటో చూడగానే ప్రియాంక.. ‘మహేశ్‌బాబు’ అని చెప్పగానే, వెంటనే రవి.. ‘ఘట్టమనేని మహేశ్‌బాబు’ సర్‌ అంటూ సమాధానమివ్వడం నవ్వులు పూయించింది. ఇదే గేమ్‌ ఆడేందుకు వచ్చిన శ్రీరామ్‌-సన్నీలకు నాగ్‌ ఓ బాలనటి ఫొటోని చూపించారు. అది చూసిన వాళ్లిద్దరూ ఆమె ఎవరో గుర్తుపట్టలేక అలాగే ఉండిపోయారు. అనంతరం సన్నీ మాట్లాడుతూ.. ‘‘సర్‌.. ఇది మీ ఫొటోనా?’’ అని అడగ్గా.. ‘‘అరేయ్‌.. పెద్ద సుత్తి తీసుకువచ్చి..సన్నీ తలపై కొట్టండి’’ అంటూ నాగ్‌ కౌంటర్‌ విసిరారు. దానిపై స్పందించిన సన్నీ.. ‘‘క్యూట్‌గా ఉన్నారు సర్‌ అందుకే అడిగాను’’ అని సమాధానమివ్వడంతో నాగ్‌ నవ్వుకున్నారు.

‘సండే ఫన్‌ డే కాదు. పనిష్‌మెంట్‌ డే’ అంటూ నాగార్జున చెప్పడంతో హౌస్‌మేట్స్‌ షాకయ్యారు. ఆ తర్వాత హౌస్‌లో ఎవరికి ఏ పదం సరిపోతుంది? అని అడగ్గా కాజల్‌ కన్నింగ్‌ అని, సిరి డబుల్‌ ఫేస్‌ అని, రవి ఫేక్‌ అంటూ ఇంటి సభ్యులు బోర్డులు వేశారు. మరి, ఇంత సరదాగా సాగుతున్న ‘బిగ్‌బాస్‌’ హౌస్‌ నుంచి ఈ వారం ఎలిమినేటై ఎవరు బయటకు వస్తారు? జెస్సీ ఆరోగ్య పరిస్థితిపై నాగ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈరోజు ప్రసారం కానున్న ఎపిసోడ్‌ చూడాల్సిందే..!



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని