ఒక్క రాత్రిలో సాగే ‘హెడ్స్‌ అండ్‌ టేల్స్‌’.. ఓటీటీలోకి సునీల్‌ కొత్త చిత్రం

సునీల్‌, చాందిని రావు, దివ్య శ్రీపాద, శ్రీ విద్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హెడ్స్‌ అండ్‌ టేల్స్‌’. ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ కథ అందించారు.

Updated : 30 Aug 2022 15:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సునీల్‌, చాందిని రావు, దివ్య శ్రీపాద, శ్రీ విద్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హెడ్స్‌ అండ్‌ టేల్స్‌’. ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ కథ అందించారు. నటుడు సాయి కృష్ణ ఎన్రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ‘జీ 5’లో అక్టోబరు 22 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. ఈ సందర్భంగా కథానాయిక రెజీనా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ‘ఒక్క రాత్రిలో జరిగే కథ ఇది. ముగ్గురు మహిళలు తమ జీవితంలో ఎదుర్కొన్న సమస్యల్ని ఎలా పరిష్కరించుకున్నారనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా ప్రతి మహిళకూ స్ఫూర్తినిస్తుంది. తమ కోసం, తమ హక్కుల కోసం పోరాడాలని సూచిస్తుంది. యువతతోపాటు కుటుంబ ప్రేక్షకులూ చూడాల్సిన సినిమా ఇది’ అని చిత్ర బృందం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని