Pushpa: వామ్మో.. సునీల్‌ మరీ ఇంత క్రూరంగా ఉన్నాడేంటి..!

తనదైన పంచులతో తెలుగువారిని కడుపుబ్బా నవ్వించి.. హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సునీల్‌.. ఇప్పుడు తన లుక్స్‌తో అందర్నీ భయపెడుతున్నారు. ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న...

Published : 07 Nov 2021 10:34 IST

మంగళం శ్రీనుగా భయపెడుతోన్న నటుడు

హైదరాబాద్: తనదైన పంచులతో తెలుగువారిని కడుపుబ్బా నవ్వించి.. హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సునీల్‌.. ఇప్పుడు తన లుక్స్‌తో అందర్నీ భయపెడుతున్నారు. ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘పుష్ప’లో సునీల్‌ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన మంగళం శ్రీనుగా నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్‌లో కనిపించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆదివారం ఉదయం ‘పుష్ప’ టీమ్‌ సునీల్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని షేర్‌ చేసింది. ‘‘రాక్షసుడి పరిచయం.. మంగళం శ్రీనుగా సునీల్‌’’ అని టీమ్‌ పేర్కొంది. ఇందులో సునీల్‌ మునుపెన్నడూ లేనివిధంగా ఎరుపెక్కిన కళ్లతో సీరియస్‌ లుక్‌లో దర్శనమిచ్చారు. సునీల్‌ లుక్‌ చూసిన ప్రతి ఒక్కరూ.. ‘‘వామ్మో.. సునీల్‌ భయ్యా.. ఏంటి ఇది..!’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

భారీ బడ్జెట్‌ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. స్టైలిష్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బన్నీ పుష్పరాజ్‌ అనే ఎర్రచందనం స్మగ్లర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయన ప్రేయసి శ్రీవల్లిగా రష్మిక సందడి చేయనున్నారు. ప్రతినాయకుడిగా మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ నటిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ‘పుష్ప ది రైజ్‌’ పేరుతో మొదటి భాగాన్ని డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని