Maanaadu: శింబు ‘మానాడు’.. రీమేక్‌ హక్కులు తెలుగులో వారివే..

ఇతర భాషల్లో విజయవంతమైన పలు చిత్రాల్ని రీమేక్‌ చేసి తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్‌.

Published : 06 Jan 2022 15:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సొంత సినిమాలతోనేలేకాకుండా ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాల్ని రీమేక్‌ చేసి తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుంటుంది ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్‌. ఇప్పుడు మరో సూపర్ హిట్‌ సినిమా రీమేక్‌తో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. అదే.. శింబు కథానాయకుడిగా దర్శకుడు వెంకట్‌ ప్రభు తెరకెక్కించిన ‘మానాడు’ చిత్రం. ఈ సినిమా రీమేక్‌ హక్కుల (భారతీయ భాషలన్నింటిలో)తోపాటు డబ్బింగ్‌ హక్కుల (తెలుగు)ను తీసుకున్నట్టు నిర్మాణ సంస్థ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది. 

టైమ్‌ లూప్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం గతేడాది నవంబరులో విడుదలై ఊహించని విజయం అందుకుంది. సరికొత్త స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులకి థ్రిల్‌ పంచింది. అబ్దుల్‌ ఖాలిక్‌గా శింబు, డీసీపీ ధనుష్కోటిగా ఎస్‌.జె. సూర్య కట్టిపడేశారు. మరి ఇలాంటి పాత్రలను తెలుగులో ఎవరు పోషిస్తారు? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. సురేశ్‌ ప్రొడక్షన్స్‌.. గతేడాది ‘నారప్ప’ (తమిళ సినిమా అసురన్‌ రీమేక్‌),  ‘దృశ్యం 2’ (మలయాళ చిత్రం దృశ్యం 2 రీమేక్‌)ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇదే సంస్థ నుంచి త్వరలో ‘శాకిని డాకిని’ సినిమా రాబోతుంది. ఇది సౌత్‌ కొరియన్‌ ఫిల్మ్‌ ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’కి రీమేక్‌గా రూపొందుతోంది.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని