Suriya: విడుదలకు ముహూర్తం

‘ఆకాశమే నీ హద్దురా’, ‘జై భీమ్‌’ చిత్రాలతో ఓటీటీ వేదికగా వరుస విజయాలు అందుకున్నారు కథానాయకుడు సూర్య. తన తదుపరి చిత్రం ‘ఎత్తర్కుమ్‌ తునింధవన్‌’ను మాత్రం పక్కాగా థియేటర్లలోనే విడుదల

Updated : 20 Nov 2021 07:35 IST

‘ఆకాశమే నీ హద్దురా’, ‘జై భీమ్‌’ చిత్రాలతో ఓటీటీ వేదికగా వరుస విజయాలు అందుకున్నారు కథానాయకుడు సూర్య. తన తదుపరి చిత్రం ‘ఎత్తర్కుమ్‌ తునింధవన్‌’ను మాత్రం పక్కాగా థియేటర్లలోనే విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ ట్విటర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నట్లు స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం ఓ చిన్న వీడియో గ్లింప్స్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఆ వీడియోలో సూర్య పంచె, చొక్కా ధరించి.. ఓ మాస్‌ బీట్‌కి స్టెప్పేస్తూ కనిపించారు. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. పాండిరాజ్‌ తెరకెక్కిస్తున్నారు. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. ఈ సినిమాకి డి.ఇమ్మాన్‌ స్వరాలందిస్తుండగా.. ఆర్‌.రత్నవేలు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని