KondaPolam: ‘శ్వాసలో’ వైష్ణవ్‌, రకుల్‌ .. ‘కొండపొలం’ కొత్త పాట విన్నారా!

‘శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశ, ఆశలో పొద్దుల్ని మరిచే హాయి మోశా’ అంటూ వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌  ఒకరిపై ఒకరు ప్రేమని వ్యక్తం చేశారు.

Updated : 06 Dec 2022 14:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశ, ఆశలో పొద్దుల్ని మరిచే హాయి మోశా’ అంటూ వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమని వ్యక్తం చేశారు. ఈ ఇద్దరు జంటగా నటించిన చిత్రం ‘కొండపొలం’. అడవి నేపథ్యంలో సాగే ఈ కథలో రవీంద్ర యాదవ్‌గా వైష్ణవ్‌, ఓబులమ్మగా రకుల్‌ కనిపించనున్నారు. ఈ చిత్రం అక్టోబరు 8న విడుదలకానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ఈ సినిమాలోని రెండో గీతాన్ని తాజాగా విడుదల చేసింది. ‘శ్వాసలో’ అంటూ సాగే ఈ మధురమైన గీతం అన్ని వర్గాల శ్రోతల్ని  అలరించేలా ఉంది. స్వీయ సంగీత దర్శకత్వంలో ఎం. ఎం. కీరవాణి ఈ పాటని రచించారు. యామిని ఘంటసాల, పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌ ఆలపించారు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా దర్శకుడు క్రిష్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. రాజీవ్‌ రెడ్డి, జె. సాయి బాబు నిర్మాతలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని