Tadap - RX 100 : మెగాస్టార్‌ మెచ్చిన ‘ఆర్‌ఎక్స్‌ 100’ రీమేక్‌ ట్రైలర్‌ ఇదే!

ఇంటెన్స్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కి.. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన చిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’. టాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని...

Updated : 28 Oct 2021 09:37 IST

ముంబయి: చిక్కటి ప్రేమకథా చిత్రంగా తెరకెక్కి.. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన చిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’ (RX 100). టాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని ‘తడప్‌’ (Tadap) పేరుతో ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కుమారుడు అహాన్‌ శెట్టి (Ahan Shetty) ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. అహాన్‌కు జంటగా తారా సుతారియా (Tara Sutaria) కథానాయికగా నటిస్తున్నారు. మిలాన్‌ లుతారియా (Milan Luthria) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌ 3న (Tadap Release Date) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ‘తడప్‌’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అహాన్‌, సుతారియా నటన... వారి డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్‌లోని ప్రేమ, యాక్షన్‌ సన్నివేశాలు మాతృకను గుర్తుచేసేలా ఉన్నాయి. మరోవైపు ‘తడప్‌’ చిత్రానికి ప్రముఖ కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అభినందనలు తెలిపారు. ట్రైలర్‌ చాలా బాగుందని.. సినిమా విజయం సాధించాలని కోరుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని