
Tamannaah: ఆమె గౌనుకు పెట్టిన డబ్బుతో ఓ కారు కొనొచ్చు..!
హైదరాబాద్: ఫ్యాషన్ విషయంలో ఎంత డబ్బు ఖర్చుపెట్టడానికైనా నటీనటులు వెనుకాడరు. సాధారణంగా వాళ్లు ధరించే దుస్తుల ధరలు వేలల్లో ప్రారంభమై.. లక్షల వరకూ ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా, ఓ ఫొటోషూట్ కోసం నటి తమన్నా సైతం అత్యంత ఖరీదైన దుస్తుల్ని ధరించారు. ఆమె ఆ డ్రెస్‌కు పెట్టిన డబ్బుతో ఓ బేసిక్ మోడల్ కారు కొనుగోలు చేయవచ్చని ఫ్యాషన్ ప్రియులు చెబుతున్నారు. ఇంతకీ ఆ డ్రెస్ ధర ఎంతంటే..
ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షోలతో ఫుల్ బిజీగా ఉంటున్న తమన్నాకు తాజాగా షూటింగ్స్ నుంచి చిన్న విరామం దొరికింది. ఫొటోషూట్స్‌తో ఆ కాస్త విరామాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఫొటోషూట్స్ కోసం ఆమె ధరించిన డ్రెస్సుల్లో నలుపు రంగు గౌను అందర్నీ ఎంతో ఆకర్షించింది. దీంతో దాని ధర ఎంత ఉంటుందో తెలుసుకోవాలని కొంతమంది భావించారు. FarFetch.com అనే వెబ్సైట్లో ఆ డ్రెస్ గురించి సెర్చ్ చేయగా.. ధర తెలుసుకుని ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందుకంటే దాని ధర సుమారు 5 వేల యూఎస్ డాలర్లు ఉంది. ఇదే డబ్బుతో ఓ కారు కొనుగోలు చేయవచ్చు కదా..!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.