Tollywood Drugs Case: డ్రగ్స్‌కేసులో ఈడీ విచారణకు తరుణ్‌

టాలీవుడ్‌ మాదకద్రవ్యాల కేసులో ఈడీ విచారణకు బుధవారం ఉదయం నటుడు తరుణ్‌ హాజరయ్యారు. మనీ లాండరింగ్‌ కోణంలో ఆయన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలు...

Updated : 22 Sep 2021 11:38 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ మాదకద్రవ్యాల కేసులో ఈడీ విచారణకు బుధవారం ఉదయం నటుడు తరుణ్‌ హాజరయ్యారు. మనీ లాండరింగ్‌ కోణంలో ఆయన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలు, డ్రగ్స్‌ విక్రేత కెల్విన్‌తో ఉన్న సంబంధాల గురించి ఈడీ అధికారులు ఆరా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎఫ్‌క్లబ్‌లో జరిగే పార్టీలకు ఎప్పుడైనా హాజరయ్యారా? మాదకద్రవ్యాలు వినియోగించే సెలబ్రిటీలెవరైనా మీకు తెలుసా? అనే అంశాలపై క్షుణ్ణంగా విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు తరుణ్‌ నుంచి సేకరించిన నమూనాల్లో డ్రగ్స్‌ ఆనవాళ్లు లేవని ఇటీవల ఎఫ్ఎస్‌ఎల్‌ నివేదికలో తేలింది. డ్రగ్స్‌ కేసులో ఆరోపణలతో 2017 జులైలో తరుణ్ నుంచి ఎక్సైజ్‌శాఖ నమూనాలు సేకరించింది. తరుణ్‌ రక్తం, వెంట్రుకలు, గోళ్లను పరీక్షించిన రాష్ట్ర ఫోరెన్సిక్‌ లేబొరేటరీ ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. దీంతో ఎక్సైజ్‌ శాఖ తరుణ్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చింది.

కాగా.. మత్తుమందుల కేసులో ఈడీ చేపట్టిన దర్యాప్తు తుదిదశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. మనీ లాండరింగ్‌ కోణంలో 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులిచ్చిన ఈడీ.. గత కొన్ని రోజుల నుంచి వారిని విచారిస్తోంది. ఇప్పటివరకూ పూరీజగన్నాథ్‌, రానా, ఛార్మి, నవదీప్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, రవితేజ.. ఇలా మొత్తం 11 మంది సెలబ్రిటీలను ఈడీ సుధీర్ఘంగా విచారించి.. వారి వద్ద నుంచి కీలక సమాచారం రాబట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని