SatyaDev: గాడ్సే టీజర్‌.. డైలాగ్స్‌తో అదరగొట్టేసిన సత్యదేవ్‌

‘బ్లఫ్‌ మాస్టర్‌’తో కెరీర్‌ ఆరంభంలోనే సత్యదేవ్‌కు విజయాన్ని అందించారు దర్శకుడు గోపీగణేశ్‌ పట్టాభి. ఇప్పుడు మరలా వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన పవర్‌ఫుల్‌ కథా చిత్రం ‘గాడ్సే’. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న...

Published : 20 Dec 2021 14:10 IST

హైదరాబాద్‌: ‘బ్లఫ్‌ మాస్టర్‌’తో కెరీర్‌ ఆరంభంలోనే సత్యదేవ్‌కు విజయాన్ని అందించారు దర్శకుడు గోపీగణేశ్‌ పట్టాభి. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన పవర్‌ఫుల్‌ కథా చిత్రం ‘గాడ్సే’. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా టీజర్‌ను సోమవారం మధ్యాహ్నం మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేశారు. ‘‘ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు’’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది.

‘‘సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులొస్తాయ్‌.. వ్యాపారం చేస్తే డబ్బులొస్తాయ్‌.. వ్యవసాయం చేస్తే డబ్బులొస్తాయ్.. కానీ, సేవ చేస్తున్నందుకు మీకు వంద, వేల, లక్షల కోట్లు ఎలా వస్తున్నాయ్‌? ఎందుకంటే సేవ పేరుతో మీరు ప్రజలు సొమ్ము దోచుకుంటున్నారు’’ అంటూ టీజర్‌ చివర్లో సత్యదేవ్‌ చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని