Tees Maar Khan: ‘తీస్‌ మార్‌ ఖాన్‌’ ఆటపాట

ఆది సాయికుమార్‌, పాయల్‌ రాజ్‌పూత్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘తీస్‌ మార్‌ ఖాన్‌’. కల్యాణ్‌ జి గోగణ తెరకెక్కిస్తున్నారు. నాగం తిరుపతి రెడ్డి నిర్మాత...

Updated : 15 Aug 2022 16:54 IST

ది సాయికుమార్‌, పాయల్‌ రాజ్‌పూత్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘తీస్‌ మార్‌ ఖాన్‌’. కల్యాణ్‌ జి గోగణ తెరకెక్కిస్తున్నారు. నాగం తిరుపతి రెడ్డి నిర్మాత. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను   ఇటీవల విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఆది, పాయల్‌ సముద్ర తీరంలో కూర్చొని.. ఒకరినొకరు చూసుకుంటూ రొమాంటిక్‌గా కనిపించారు. ‘‘యాక్షన్‌ ప్రాధాన్యమున్న కథతో రూపొందుతోన్న చిత్రమిది. ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో భాగంగా నాయకానాయికలపై ఓ రొమాంటిక్‌ గీతం తెరకెక్కిస్తున్నాం. ఈ సినిమాలో పాయల్‌, ఆది చాలా కొత్తగా కనిపిస్తారు’’ అని దర్శక నిర్మాతలు తెలియజేశారు. సంగీతం: సాయి కార్తీక్‌, ఛాయాగ్రహణం: బాల్‌ రెడ్డి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని