TS News: రాష్ట్ర ప్రభుత్వానికి ఫిల్మ్‌ఛాంబర్‌ కృతజ్ఞతలు

థియేటర్లకు ఆర్థికంగా వెసులుబాటు కలిగేలా పార్కింగ్‌ ఫీజులు వసూలు చేసేందుకు సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్ల యాజమాన్యాలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సభ్యులు, ఎగ్జిబిటర్లు.

Published : 21 Jul 2021 17:54 IST

హైదరాబాద్‌: థియేటర్లకు ఆర్థికంగా వెసులుబాటు కలిగేలా పార్కింగ్‌ ఫీజులు వసూలు చేసేందుకు సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్ల యాజమాన్యాలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సభ్యులు, ఎగ్జిబిటర్లు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘థియేటర్ల మనుగడ కోసం పార్కింగ్‌ ఫీజు వసూలు చేసేందుకు అనుమతి ఇవ్వాలనే మా అభ్యర్థనని అంగీకరించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌ కుమార్‌, అరవింద్‌ కుమార్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం’ అని పేర్కొన్నారు. పలు కారణాల వల్ల సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్లు మూతబడుతున్న విషయాన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టనుందని తెలిపారు.

2018లో పార్కింగ్ ఫీజులను రద్దు చేస్తూ జారీ చేసిన జీవో నెం.63ను సవరిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ఉత్తర్వులు కేవలం సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మాత్రమే వర్తిస్తాయని, మల్టీఫ్లెక్స్లు, వ్యాపార వాణిజ్య సముదాయాల్లో ప్రజల నుంచి పార్కింగ్ ఫీజులు వసూలు చేయవద్దని ఆదేశించింది. ఇందుకు సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని