
Akhanda: బాలకృష్ణ అభిమానులకు శుభవార్త.. ఆ థియేటర్లలో ‘అఖండ’ బెనిఫిట్ షో షురూ!
హైదరాబాద్: బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను రూపొందించిన చిత్రం ‘అఖండ’. డిసెంబరు 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా బెనిఫిట్ షోల ప్రదర్శనకు నగరంలోని రెండు థియేటర్లకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కూకట్పల్లిలోని మల్లికార్జున, భ్రమరాంబ థియేటర్లకు బెనిఫిట్ షోలు ప్రదర్శించేందుకు అనుమతినిచ్చింది. ఈ స్పెషల్ షోలకు టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ముందుగా ‘అఖండ’ చిత్రం ఈ థియేటర్లలోనే ప్రదర్శితంకానుంది. ఉదయం 4: 30 ని.లకు ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్ల తర్వాత వస్తున్న చిత్రమిది. మిర్యాల రవీందర్రెడ్డి నిర్మించారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ సందడి చేయనుంది. జగపతిబాబు, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు.
► Read latest Cinema News and Telugu News