Thalaivii: ఆ ఓటీటీలోకి ‘తలైవి’ తెలుగు వెర్షన్‌ 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటి జయలలిత జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం ‘తలైవి’.

Published : 27 Sep 2021 22:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటి జయలలిత జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం ‘తలైవి’. కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్ర పోషించింది. అరవింద్‌ స్వామి, మధుబాల, పూర్ణ కీలక పాత్రలు పోషించారు. ఎ.ఎల్‌. విజయ్‌ దర్శకుడు. ఈ చిత్రం థియేటర్లలో ఇటీవల విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. మరోవైపు, ఇప్పటికే ఈ చిత్ర హిందీ వెర్షన్‌ ‘నెట్‌ఫ్లిక్స్‌’ వేదికగా అలరిస్తోంది. త్వరలోనే తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం వెర్షన్‌లు అందుబాటులోకి రానున్నాయి. ‘అమెజాన్‌ ప్రైమ్ వీడియో’లో అక్టోబరు 10 నుంచి స్ట్రీమింగ్‌ కానున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని