Thalaivii: ‘తలైవి’ విడుదల ఖరారు.. రౌడీ బాయ్‌ విచ్చేశాడు

కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తలైవి’. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథతో రూపొందిన పాన్‌ ఇండియా చిత్రమిది. ఏ.ఎల్‌. విజయ్‌ దర్శకుడు. విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌, బ్రిందా ప్రసాద్‌ నిర్మాతలు. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 10న విడుదల చేస్తున్నట్టు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.

Published : 23 Aug 2021 22:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తలైవి’. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథతో రూపొందిన పాన్‌ ఇండియా చిత్రమిది. ఏ.ఎల్‌. విజయ్‌ దర్శకుడు. విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌, బ్రిందా ప్రసాద్‌ నిర్మాతలు. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 10న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రంలో అరవింద్‌ స్వామి, ప్రకాష్‌రాజ్‌, పూర్ణ, మధుబాల తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి సంగీతం: జీవీ ప్రకాష్‌, ఛాయాగ్రహణం: విశాల్‌ విఠల్‌.


ఆశిష్‌ ఆగమనం..

 దిల్‌రాజు మేనల్లుడు ఆశిష్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్‌’. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. ‘హుషారు’ ఫేం హర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఆశిష్‌ ఫస్ట్‌లుక్‌ని సామాజిక మాధ్యమాల వేదికగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ఆశిష్‌ కెమెరాని పట్టుకుని కనిపించారు. చేతులపై టాటూలతో దర్శనమిచ్చి ఆకట్టుకుంటున్నారు. ఇంజినీరింగ్‌, మెడికల్‌ కాలేజీ విద్యార్థుల మధ్య సాగే కథ ఇది. ప్రేమ, యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాల్ని శరవేగంగా పూర్తి చేసుకుని అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని