Cinema News: రొటీన్‌కు భిన్నంగా ‘ది ట్రిప్‌’

ఆమని, గౌతమ్‌ రాజు, సౌమ్య శెట్టి ప్రధాన పాత్రల్లో వంశీకృష్ణ ఆకెళ్ల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది ట్రిప్‌’. దుర్గం రాజమౌళి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు.

Updated : 27 Oct 2021 07:32 IST

ఆమని, గౌతమ్‌ రాజు, సౌమ్య శెట్టి ప్రధాన పాత్రల్లో వంశీకృష్ణ ఆకెళ్ల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది ట్రిప్‌’. దుర్గం రాజమౌళి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. ‘‘ఓ సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందిస్తున్నాం. పోస్టర్‌కు తగ్గట్లుగానే కథనం రొటీన్‌కు భిన్నంగా ఉంటుంది. కచ్చితంగా అందరికీ నచ్చుతుందని నమ్మకంగా ఉంది. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని దర్శక నిర్మాతలు  తెలియజేశారు. ఈ సినిమాకి సంగీతం: కార్తిక్‌ కొడకండ్ల, ఛాయాగ్రహణం: విశ్వ దేవబత్తుల.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని