Samantha: ‘ఫ్యామిలీ మ్యాన్‌’లో రాజీగా అదరగొట్టిన సమంత.. బెస్ట్‌ సీన్స్‌ ఇవే!

కథానాయిక సమంత ప్రతినాయక ఛాయలున్న పాత్రలో నటించి మెప్పించిన వెబ్‌ సిరీస్‌ ‘ఫ్యామిలీ మ్యాన్‌2’. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా

Published : 14 Nov 2021 18:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కథానాయిక సమంత ప్రతినాయక ఛాయలున్న పాత్రలో నటించి మెప్పించిన వెబ్‌ సిరీస్‌ ‘ఫ్యామిలీ మ్యాన్‌2’. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలైన ఈ సిరీస్‌ అత్యధిక రేటింగ్స్‌ సంపాదించుకుంది. మనోజ్‌ బాజ్‌ పాయ్‌కు దీటుగా రాజీ పాత్రలో సమంత నటన, యాక్షన్‌ సన్నివేశాల్లో అదరగొట్టింది. ఇంతకు ముందెప్పుడూ చూడని సరికొత్త సమంతను చూసి అభిమానులే కాదు, విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. శ్రీలంకలోని తమిళుల కోసం పోరాడే రెబల్‌గా సమంత జీవించిందనే చెప్పాలి. తాజాగా ‘బెస్ట్‌ ఆఫ్‌ రాజీ’ పేరుతో అమెజాన్‌ ప్రైమ్‌ యూట్యూబ్‌ వేదికగా ఓ వీడియోను పంచుకుంది. అందులో రాజీగా సమంత నటించిన సీన్స్‌ చూసి నెటిజన్లు మరోసారి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ ఆసక్తికర వీడియోను మీరూ చూసేయండి.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని