The Family Man Season 2: ‘ఫ్యామిలీ మ్యాన్‌’ అభిమానులకు శుభవార్త 

విశేష ప్రజాదారణ పొందిన వెబ్‌ సిరీస్‌ల్లో ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ ఒకటి. మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి తదితరులు కీలక పాత్రధారులుగా రాజ్‌ అండ్‌ డీకే తెరకెక్కించారు. 2019లో ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలైన సీజన్‌ 1 ఘన విజయం అందుకుంది.

Published : 26 Aug 2021 01:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విశేష ప్రేక్షకాదరణ పొందిన వెబ్‌ సిరీస్‌ల్లో ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ ఒకటి. మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి తదితరులు కీలక పాత్రధారులుగా రాజ్‌ అండ్‌ డీకే తెరకెక్కించారు. 2019లో ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలైన సీజన్‌-1 ఘన విజయం అందుకుంది. దాంతో సీజన్‌-2పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పైగా ప్రముఖ కథానాయిక సమంత కీలక పాత్ర పోషించడంతో అంచనాలు ఆకాశన్నంటాయి.

ఆ అంచనాలకు తెరదించుతూ 2021 జూన్‌ 3న సీజన్‌-2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తెలుగు, తమిళ ప్రేక్షకులకి కాస్త నిరాశ కలిగిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ సిరీస్‌ కేవలం హిందీలోనే విడుదలైంది. మన భాషలో ఎప్పుడెప్పుడు చూడాలా? అని ఆసక్తిగా ఎదురుచూసిన వారికి ‘ఫ్యామిలీ మ్యాన్‌’ బృందం తాజాగా శుభవార్త వినిపించింది. తెలుగు, తమిళ, ఇంగ్లిష్‌ డబ్బింగ్‌ వెర్షన్‌ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ప్రకటించింది. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఓటీటీలో ఓ లుక్కేయండి..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని