
Bheemla Nayak: అభిమానులకు పవన్ సర్‌ప్రైజ్.. ‘లాలా భీమ్లా’ సౌండ్ అదిరింది!
ఇంటర్నెట్ డెస్క్: ‘భీమ్లా నాయక్’గా వచ్చే ఏడాది సంక్రాంతికి సందడి చేయనున్నారు ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్. ఈయన పాత్రకు సంబంధించి ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్‌లో ‘లాలా భీమ్లా’ అనే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినీ అభిమానుల్ని ఎంతగానో అలరించింది. పవన్ క్యారెక్టర్, సినిమాపై భారీ అంచనాలు పెంచింది. సినిమాలో ఈ థీమ్ సాంగ్ ఎలా ఉండబోతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు పవన్ సర్‌ప్రైజ్ అందించారు. ‘ది సౌండ్ ఆఫ్ భీమ్లా’ పేరుతో ప్రోమోను విడుదల చేశారు. మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌గా ‘భీమ్లా నాయక్’ రూపొందుతోంది. రానా కీలక పాత్ర పోషిస్తున్నారు. నిత్య మేనన్, సంయుక్త మేనన్ కథానాయికలు. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.
తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2022 జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.