Most Eligible Bachelor: లెహరాయి అంటే అర్థం ఇదే
రేమ... రెండక్షరాల లోకం. ఈ లోకంలో చట్టాపట్టాలేసుకొని విహరించడానికి ప్రియురాలు దొరికితే ఆ ప్రియుడి సంతోషాన్ని వర్ణించడానికి వర్ణమాల సరిపోదనడంలో అతిశయోక్తి లేదు. అలా ప్రేమజంటలు తమ ప్రేమను...
చిత్రం: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్; తారాగణం: అక్కినేని అఖిల్, పూజా హెగ్డే; దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్; గీతం: గోపిసుందర్; సాహిత్యం: శ్రీమణి; గానం: సిద్ శ్రీరామ్; నిర్మాణ సంస్థ: జీఏ2పిక్చర్స్
ప్రేమ... రెండక్షరాల లోకం. ఈ లోకంలో చట్టాపట్టాలేసుకొని విహరించడానికి ప్రియురాలు దొరికితే ఆ ప్రియుడి సంతోషాన్ని వర్ణించడానికి వర్ణమాల సరిపోదనడంలో అతిశయోక్తి లేదు. అలా ప్రేమజంటలు తమ ప్రేమను ఆస్వాదిస్తూ పాడుకునే ఎన్నో పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో పదిలంగా ఉన్నాయి. వాటిని రచించిన ఎందరో రచయితలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త పదాలు అన్వేషిస్తూ, సరికొత్తగా ప్రణయ గీతాలను పరిచయం చేస్తుంటారు. అలాంటి ఓ పాటే ఈ ‘లెహరాయి...’ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం కోసం ప్రముఖ యువ రచయిత శ్రీమణి ఈ పాటను రచించారు. గోపిసుందర్ సంగీతాన్ని అందించగా తన గాత్రంతో యువతను కట్టిపడేస్తోన్న సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ సందర్భంగా లెహరాయి పాట అనుభవాలను, అందులోని ప్రేమతత్వాన్ని రచయిత శ్రీమణి ‘ఈనాడు సినిమా’తో పంచుకున్నారు.
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంలో నేను రెండు పాటలు రాశా. అందులో ఈ లెహరాయి ఒకటి. లెహరాయి అంటే అర్థం తేలిపోవడం. పక్షి గాల్లో రెక్కలాడిస్తూ ఎగురుతున్న సంతోషాన్ని లెహరాయి అంటారు. ఈ పాట సన్నివేశంలో కథానాయకుడి హృదయ స్పందన అలా ఉంటుంది. ఆ భావన కోసం ప్రయత్నిస్తూ చాలా రకాలుగా పాట రాశా. అందులో లెహరాయి అనే శబ్దం దర్శకుడు భాస్కర్‌కు బాగా నచ్చింది. ఆ పదంతోనే పాట ప్రారంభించాం. కథానాయకుడి జీవితంలో చాలా ముఖ్యమైన సమయంలో ఈ పాట వస్తుంది. అప్పుడే పెళ్లైన కొత్త జంట తాలుకూ రొమాన్స్ పదాల్లో ఉండాలని దర్శకుడు అడిగారు. అలాగే నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు ఒక అబ్బాయిలో కలిగే సంతోషం కావాలన్నారు. అవన్నీ ఇమిడి పోయేలా రాశా. పెద్ద పెద్ద పదాలతో కాకుండా చాలా అలతి అలతి పదాలు పాటలో ఉంటాయి. ఈ సినిమాలో కథానాయకుడి పాత్రను ప్రతి ప్రేమికుడికి దగ్గరయ్యేలా దర్శకుడు తీర్చిదిద్దారు. ‘‘లెహరాయి లెహరాయి... గోరువెచ్చనైన ఊసులదిరాయి, గుండె వెచ్చనైనా ఊహలెగిరాయి’’ అనే వాక్యాలు దర్శకుడు భాస్కర్‌కు బాగా నచ్చాయి. చరణంలోకి వస్తే.. వంట గదిలో మంటలన్నీ ఒంటిలోకే ఒంపుతుంటే.. మరి నిన్నా మొన్నా ఒంటిగా ఉన్న ఈడే నేడే లెహరాయీ, వేళా పాలలనే మరిచే సరసాలే.. తేదీ వారాలే చెరిపే చెరసాలే..... ఇలా ప్రతి లైన్ కొత్తగా ఉండటానికి ప్రయత్నించాను.
గోపిసుందర్ సంగీతం చాలా గొప్పగా ఉంటుంది. ఆయన బాణీలు ఎప్పటికప్పుడు కొత్తదనంతో నిండిఉంటాయి. మాలాంటి రచయితలకు సవాల్‌గానూ అనిపిస్తాయి. గోపిసుందర్తో కలిసి ‘గీతగోవిందం’ చిత్రంలో వచ్చిందమ్మ అనే పాట రాశాను. అది కూడా సిద్ పాడాడు. లెహరాయి మా ఇద్దరికి రెండో పాట. సిద్ గాత్రం అందించడం వల్ల ఎంతో మంది హృదయాలకు ఈ పాట చేరువైంది. అన్ని పాటలు సినిమాలో చాలా కీలకంగా ఉంటాయి. యువత, పెద్దలకు నచ్చే చాలా అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి.
లెహరాయి.. లెహరాయీ..
ఏ లేలేలే.. లేలేలేలే..
లెహరాయీ లెహరాయీ..
గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి..
లెహరాయీ లెహరాయీ..
గోరు వెచ్చనైన ఊసులదిరాయి..
ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి..
కళ్లలోనే దాగి ఉన్న అమ్మాయి..
సొంతమల్లే చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయీ..
లెహరాయీ లెహరాయీ.. గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి..
లెహరాయీ లెహరాయీ.. గోరు వెచ్చనైన ఊసులదిరాయి..
చరణం1:
రోజూ చక్కిలితో సిగ్గుల తగువాయే..
రోజూ పెదవులతో ముద్దుల గొడవాయే..
వంట గదిలో మంటలన్నీ ఒంటిలోకే ఒంపుతుంటే..
మరి నిన్నా మొన్నా ఒంటిగా ఉన్న ఈడే నేడే లెహరాయీ.. ।।లెహరాయి।।
చరణం2:
వేళా పాలలనే మరిచే సరసాలే..
తేదీ వారాలే చెరిపే చెరసాలే..
చనువు కొంచెం పెంచుకుంటూ..
తనువు బరువే పంచుకుంటూ..
మనలోకం మైకం ఏకం అవుతూ..
ఏకాంతాలే లెహరాయీ.. ।।లెహరాయీ।।
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్‌లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్‌చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్‌చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!
భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్ ఒకరు. బాలీవుడ్లో షారుక్‌ఖాన్, ఆమిర్‌ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత ‘ఫ్యామిలీస్టార్’ చిత్రానికి పనిచేశారు. -
నయన్... నాయికా ప్రాధాన్య చిత్రం?
ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ. -
అదే కాంబో కొత్త చిత్రం?
‘బూమ్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినా కైఫ్. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్‌తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా. -
అదితిరావ్, సిద్ధార్థ్‌ల పెళ్లి!
కథానాయకుడు సిద్ధార్థ్, నాయిక అదితిరావ్ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. -
గాయంతోనే చిత్రీకరణ పూర్తి చేశా
‘దిల్ సే సోల్జర్..దిమాక్ సే సైతాన్స్’ అంటూ యాక్షన్ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’. -
రెండు సంస్థలు కలిసి...
గోపీచంద్ కథానాయకుడిగా... శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. -
‘కలియుగం కలుషితం’ అనుకున్నాము
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. -
నా బెడ్ రూమ్‌లో దెయ్యం కనిపించేది
హారర్ థ్రిల్లర్స్‌లో ‘ఇన్స్పెక్టర్ రిషి’ ఒక ప్రత్యేకమైన సిరీస్ అవుతుందన్నారు నవీన్‌చంద్ర. ఆయన కథానాయకుడిగా... నందిని జేఎస్ దర్శకత్వంలో రూపొందిన సిరీస్ ఇది. సునయన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ కీలక పాత్రలు పోషించారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్‌తో కృతి సనన్
సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
-
గవర్నర్ పదవి త్యజించడం మంచిదే: తమిళిసై
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్‌లో నమోదైన రికార్డులివీ..
-
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
-
ప్రవీణ్‌ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
-
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ