Updated : 06/10/2021 12:41 IST

Bigg boss Telugu 5: కాజల్‌కు లోబో వేలు ఎందుకు చూపించాడు?.. నన్ను విలన్‌ను చేస్తావా?.. రవి ఫైర్

హైదరాబాద్‌: జెస్సీ కారణంగా శ్రీరామ్‌-షణ్ముఖ్‌ల మధ్య తలెత్తిన వివాదం బిగ్‌బాస్‌ హౌస్‌లో మరోరోజు కొనసాగింది. ఇద్దరూ ఎవరికి వాళ్లు తమదే కరెక్ట్‌ అన్నట్లు మాట్లాడారు. ఏం జరిగిందే తెలుసుకోకుండా మాట్లాడడం తప్పు అన్న శ్రీరామ్‌.. షణ్ముఖ్‌కు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అయినా షణ్ముఖ్‌ వినలేదు సరికదా.. వితండవాదానికి దిగాడు. ‘నా ఫ్రెండ్‌ కోసం నేను అడిగాను. అందులో తప్పేం ఉంది’ అని వాదనకు దిగాడు. మధ్యలో జెస్సీ మరికొన్ని మాటలతో ఇంకొంత ఆజ్యం పోశాడు. ‘ఏదైనా గాయమైతే.. అది తగ్గేలా చూడాలి కానీ.. దాన్ని మరింత పెంచొద్దు’ అంటూ ప్రియాంక-ప్రియ ఈ గొడవ గురించి మాట్లాడుకున్నారు.

శ్రీరామ్‌-షణ్ముఖ్‌ల మధ్య వివాదం ముగియక ముందే బిగ్‌బాస్‌ హౌస్‌లో మరో గొడవ మొదలైంది. గదిలో పడుకున్న రవి-లోబో దగ్గరకు వచ్చిన కాజల్‌ వెక్కిరింతగా మాట్లాడింది. ‘నెల రోజులుగా మీరు బాత్‌రూమ్‌ పని తప్ప మరే పని చేయడం లేదు. ఇప్పుడు కిచెన్‌ వర్క్‌ వచ్చింది’ అంటూ కాజల్‌ హేళనగా మాట్లాడడంతో రవి-లోబో అసహానికి గురయ్యారు. దీంతో కాజల్‌ని లోబో వేలెత్తి చూపించాడు. మొదట సరదాగా తీసుకున్న కాజల్‌ కాసేపటికే.. ‘నేను అన్నదానికి వేలు ఎందుకు చూపించావు’ అని లోబోపై ఫైర్‌ అయ్యింది. దీనికి వకాల్తా తీసుకున్న రవి.. ‘ఏదైనా కాసేపు అంటే సరదాగా ఉంటుంది కానీ.. పదే పదే వెక్కిరింతగా మాట్లాడితే ఎవరికైనా ఒళ్లు మండుతుంది. మీకు సరదాగానే ఉండొచ్చు,  నాకు కాదు’ అంటూ ఫైర్‌ అయ్యాడు. ‘ఆ విషయాన్ని నువ్వు అప్పుడే చెప్పుంటే ఆపేసేదాన్ని’ అని కాజల్‌ అనగా.. ‘ఆ కోపంలో నేను ఏదైనా అంటే విలన్‌ అవుతాను కదా! నా కళ్లు చూసి అర్థం చేసుకుంటావ్‌ అనుకున్నా’ అని రవి వివరణ ఇచ్చాడు. లోబో వేలు చూపించడాన్ని ఎత్తి చూపిస్తూ.. కాజల్‌ పదే పదే మాటల దాడికి దిగింది. లోబో చేసింది తప్పేనని.. అతనితో తర్వాత తాను మాట్లాడతానని రవి సర్దిచెప్పాడు. వీరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం కెప్టెన్‌ శ్రీరామ్‌ తీసుకున్నాడు. దీన్ని చూసిన షణ్ముఖ్‌ మా మధ్య జరిగిన దానికి తీర్పు చెప్పలేదు కానీ ఇప్పుడు పెదరాయుడిలా అక్కడ తీర్పు చెబుతున్నాడు చూడండి అంటూ హేళనగా మాట్లాడాడు.

ఆ తర్వాత ఇంటిసభ్యులందరికీ బిగ్‌బాస్‌ అమెజాన్‌ సేల్‌ టాస్క్‌ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో ప్రియ టీవీ గెలుపొంది.. తన తల్లికి, షణ్ముఖ్‌ ల్యాప్‌టాప్‌ దక్కించుకుని.. తన డైరెక్టర్‌ సుబ్బుకు, మానస్‌ స్మార్ట్‌వాచ్‌.. హమీద స్మార్ట్‌ ఫోన్‌ గెలుచుకుని వాళ్ల అమ్మలకు బహుమతులుగా పంపించారు.

బిగ్‌బాస్‌ రాకుమారుడు ఎవరు..

బిగ్‌బాస్‌ హౌస్‌లో మరో టాస్క్‌ మొదలైంది. ‘రాకుమారుడు ఎవరో చెప్పాలి’ అంటూ ఇచ్చిన టాస్క్‌లో సన్నీ.. రవిలను రాకుమారులుగా ఇంటి సభ్యులు ఎంపిక చేశారు. హౌస్‌మేట్స్‌ వీరిలో ఎక్కువమంది ఎవరికి సపోర్ట్‌ చేస్తే వాళ్లే రాకుమారుడు అవుతారని సూచించాడు. ఇంటి సభ్యుల మెప్పు పొందడానికి రాకుమారులకు బిగ్‌బాస్‌ కొంత ధనాన్ని ఇచ్చాడు. ఆ డబ్బును ఇంటిసభ్యులకు ఇచ్చి వాళ్ల మద్దతు పొందవచ్చని బిగ్‌బాస్‌ సూచించాడు. కాబోయే యువరాజు ఇచ్చే ధనాన్ని హౌస్‌మేట్స్‌ జాగ్రత్తగా దాచుకోవాలని.. పక్కనవారికి ఇచ్చిన ధనాన్ని కావాలనుకుంటే వేరేవాళ్లు కూడా దొంగిలించవచ్చని తెలిపాడు. ఈ క్రమంలో యువరాజు ఖజానా నుంచే కొందరు ఇంటిసభ్యులు నాణేలు దొంగిలించారు. ఇద్దరు రాకుమారుల తరఫు నుంచి ఇద్దరు వ్యక్తులు  వచ్చి మల్లయుద్ధంలో పాల్గొనాలని.. గెలిచిన వారికి 150 నాణేలు ఇస్తానని బిగ్‌బాస్‌ చెప్పాడు. ఈ పోటీలో యువరాజుగా ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని