VandeMataram: దేశభక్తిని చాటుకున్న టైగర్‌ ష్రాఫ్‌

కండలవీరుడిగా పేరొందిన బాలీవుడ్‌ యువ నటుడు టైగర్‌ ష్రాఫ్‌ గాయకుడిగా మారాడు. ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నాడు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన ఈ పాటని తాజాగా విడుదల చేశారు.

Published : 10 Aug 2021 14:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కండలవీరుడిగా పేరొందిన బాలీవుడ్‌ యువ నటుడు టైగర్‌ ష్రాఫ్‌ గాయకుడిగా మారాడు. ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నాడు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన ఈ పాటని తాజాగా విడుదల చేశారు. విశాల్‌ మిశ్రా స్వరాలు సమకూర్చిన ఈ గీతానికి కౌశల్‌ కిశోర్‌ సాహిత్యం అందించారు. రెమో డిసౌజా దర్శకత్వం వహించారు. ‘హిందూస్థాన్‌ మేరీ జాన్‌’ అంటూ ప్రారంభమైన ఈ పాట భారతీయులందరినీ హత్తుకునేలా ఉంది. ష్రాఫ్‌ గానం, నాట్యం అలరిస్తున్నాయి. లొకేషన్లు ఆకట్టుకుంటున్నాయి. ‘ఇది కేవలం పాట మాత్రమే కాదు ఓ భావోద్వేగం. ఈ గీతాన్ని దేశానికి అంకితమిస్తున్నా’ అని తెలిపాడు ష్రాఫ్‌. ‘హీరోపంటి’ చిత్రంతో నటుడిగా మారిన ఆయన ‘వార్‌’, ‘భాగీ’ సిరీస్‌ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని