‘తిమ్మరుసు’, ‘డియర్‌ మేఘ’ నుంచి కొత్త సాంగ్స్‌

యువ నటుడు సత్యదేవ్‌ లాయరు పాత్రలో నటించిన చిత్రం ‘తిమ్మరుసు’. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. ప్రియాంక జవాల్కర్‌ నాయిక. ఈ సినిమా జులై 30న థియేటర్లలో విడుదల కానుంది.

Updated : 08 Dec 2022 15:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ నటుడు సత్యదేవ్‌ లాయరు పాత్రలో నటించిన చిత్రం ‘తిమ్మరుసు’. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. ప్రియాంక జవాల్కర్‌ నాయిక. ఈ సినిమా జులై 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘ది తిమ్మరుసు’ అంటూ సాగే ప్రమోషన్‌ సాంగ్‌ని విడుదల చేసింది ప్రముఖ నాయిక సమంత. ‘వెల్‌కమ్‌ టు తిమ్మరుసు ఫ్యాక్ట్స్‌.. ఈ సినిమాలో ఓ లవ్‌ సాంగ్‌ ఉండాలి కానీ నిడివి ఎక్కువ అయిందని తీసేశాం. తర్వాత ఈవిడ (ప్రియాంక జవాల్కర్‌) గోల ఎక్కువైంది. ఈ కోసమే ఈ ప్రమోషన్‌ సాంగ్‌’ అంటూ సత్యదేవ్‌ చెప్పిన డైలాగ్‌తో ప్రారంభమైంది ఈ గీతం. ఈ వీడియోలో సత్యదేవ్‌, ప్రియాంకతోపాటు బ్రహ్మాజీ, వైవా హర్ష కనిపించారు. కిట్టు విస్సాప్రగడ రచించిన ఈ పాటని రఘు దీక్షిత్‌ ఆలపించారు. జ్యోత్స్న పాకాల, అంబికా, యామిని ఘంటసాల కోరస్‌ అందించారు. శ్రీచరణ్ పాకాల స్వరాలు సమకూర్చారు. నటీనటుల స్టెప్పులు, సినిమాలోని కొన్ని సన్నివేశాలతో రూపొందించిన ఈ వీడియో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మహేశ్‌ ఎస్‌. కోనేరు నిర్మించిన ఈ ‘తిమ్మరుసు’ కథేంటి? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

‘డియర్‌ మేఘ’.. ఆమని ఉంటే పక్కన

అదిత్‌ అరుణ్‌, మేఘా ఆకాశ్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘డియర్‌ మేఘ’. సుశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని ‘ఆమని ఉంటే పక్కన’ అంటూ సాగే మెలొడీని నాయిక పూజా హెగ్డే తాజాగా విడుదల చేసింది. కృష్ణకాంత్‌ సాహిత్యం అందించగా అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. గౌర హరి స్వరాలు సమకూర్చారు. ఈ లిరికల్‌ వీడియోలో నాయకానాయికల హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. అర్జున్‌ దాస్యన్‌ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని