Akhanda: ‘అఖండ’ టైటిల్‌ సాంగ్‌ వచ్చేసింది..!

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న సరికొత్త ‘అఖండ’. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం ఈ సినిమా నుంచి ‘అఖండ’ టైటిల్‌ సాంగ్‌ని...

Published : 08 Nov 2021 12:59 IST

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అఖండ’. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం ఈ సినిమా నుంచి ‘అఖండ’ టైటిల్‌ సాంగ్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ‘కం కం కంగుమంది శంఖం’ అంటూ సాగే ఈ పాటను ప్రముఖ గాయకుడు శంకర్‌ మహదేవన్‌.. ఆయన ఇద్దరు కుమారులు సిద్దార్థ్‌, శివమ్‌ ఆలపించారు. తమన్‌ స్వరాలు అందించారు. మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలయ్య పవర్‌ఫుల్‌ లుక్‌తోపాటు అఘోరాగానూ కనిపించనున్నారు. బాలయ్యకు జోడీగా నటి ప్రగ్యాజైస్వాల్‌ సందడి చేయనున్నారు.  శ్రీకాంత్‌ విలన్‌గా కనిపించనున్నారు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై ఈసినిమా నిర్మితమవుతోంది. బోయపాటి-బాలయ్య కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని