Tollywood Drugs Case: 5 గంటలుగా కొనసాగుతున్న నవదీప్‌ ఈడీ విచారణ

నవదీప్‌ ఈడీ విచారణ ఐదు  గంటలుగా కొనసాగుతోంది. అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీస్తోన్న ఈడీ అధికారులు.

Published : 13 Sep 2021 16:34 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ మాదకద్రవ్యాల కేసు విచారణలో భాగంగా నటుడు నవదీప్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట ఈరోజు ఉదయం హాజరైన సంగతి తెలిసిందే. సుమారు ఐదు గంటల నుంచి ఈడీ అధికారులు నవదీప్‌ని ప్రశ్నిస్తున్నారు. నవదీప్‌తోపాటు ఎఫ్ క్లబ్‌ జి.ఎం. విక్రమ్‌నీ ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా మనీ లాండరింగ్‌ కోణంలో అనుమానాస్పద లావాదేవాలపై విచారణ కొనసాగిస్తున్నారు. నవదీప్‌ బ్యాంకు ఖాతా నుంచి డ్రగ్స్‌ సరఫరాదారు కెల్విన్‌ ఖాతాకి నగదు బదిలీ అయిందా, లేదా? అని పరిశీలిస్తున్నారు. డ్రగ్స్‌ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద సినీరంగానికి చెందిన 12 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగానే నవదీప్‌ విచారణకి హాజరయ్యారు. ఇప్పటికే ఈడీ అధికారులు దర్శకుడు పూరీ జగన్నాథ్‌, ఛార్మి, నందు, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, రాణా, రవితేజ నుంచి వివరాల్ని సేకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని