Tuck Jagadish: ఆ ఒక్క సీన్‌ చాలు.. నానిని ‘నేచురల్‌ స్టార్‌’ అని పిలవడానికి..!

వినాయకచవితి సందర్భంగా సెప్టెంబరు 10న ‘టక్‌ జగదీష్‌’ విడుదలవుతున్న నేపథ్యంలో నాని, రీతూ వర్మ అభిమానుల కామెంట్స్‌కు సమాధానాలు ఇచ్చారు.

Published : 08 Sep 2021 23:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నాని కథానాయకుడిగా శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ, యాక్షన్‌ డ్రామా ‘టక్‌ జగదీష్‌’. రీతూ వర్మ, ఐశ్వర రాజేశ్‌ కథానాయికలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు ముస్తాబైంది. వినాయకచవితి సందర్భంగా సెప్టెంబరు 10న ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా నాని, రీతూ వర్మ అభిమానుల కామెంట్స్‌కు సమాధానాలు ఇచ్చారు.

‘టక్‌ జగదీష్‌’ ట్రైలర్‌ చూసిన ఓ అభిమాని ‘చివరి సన్నివేశంలో నాని ఎక్స్‌ప్రెషన్‌ ఒక్కటిచాలు. అందుకే ఆయన్ను నేచురల్‌ స్టార్‌ అని పిలుస్తారు’ అని కామెంట్ చేయగా, ఆ క్రెడిట్‌ దర్శకుడు శివ నిర్వాణకు దక్కుతుందని, అందరూ ఆ సీన్‌ను మెచ్చుకుంటున్నారని నాని సమాధానం ఇచ్చారు. ‘ఎమోషనల్‌ సన్నివేశాలు చేయడంలో ప్రస్తుత జనరేషన్‌ ఉన్న నటులతో పోలిస్తే నాని 1000 మైళ్ల ముందున్నాడు. ఒక్కడంటే ఒక్కడు కూడా ఆయన నటనపై కామెంట్‌ చేయడానికి పనికిరాడు’ అని మరో అభిమాని పేర్కొనగా, నాని నటన చూసి తాను కూడా ఫిదా అయినట్లు రీతూవర్మ అన్నారు. ఇలా అభిమానుల స్పందనలకు నాని, రీతూ వర్మ ఏ విధంగా సమాధానం ఇచ్చారో మీరే చూసేయండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని