Tuck Jagadish: ‘టక్‌ జగదీశ్‌’ పాట అదుర్స్‌.. గొంతు సవరించిన శివ..!

తెలుగు సినీ ప్రియులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రాల్లో ‘టక్‌ జగదీశ్‌’ ఒకటి. నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా ఈ సినిమా తెరకెక్కుతోంది....

Updated : 03 Sep 2021 12:31 IST

హైదరాబాద్‌: తెలుగు సినీ ప్రియులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రాల్లో ‘టక్‌ జగదీశ్‌’ ఒకటి. నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శివ నిర్వాణ దర్శకుడు. ఈ సినిమా కోసం మొదటిసారి దర్శకుడు శివ గొంతు సవరించుకున్నారు. సినిమాలో నాని పాత్రను తెలియజేసేలా రూపొందించిన ‘సల్లాటి కుండలో.. సల్ల సక్క మనసువాడు’ పాటను ఆయన ఆలపించారు. రాయలసీమ యాసలో సాగే ఈ పాటను చిత్రబృందం శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేసింది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 10న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ సినిమా విడుదల కానుంది.

‘నిన్నుకోరి’ తర్వాత నాని-శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తోన్న రెండో సినిమా ఇది. భూ తగాదాలు.. కుటుంబ విలువలు ప్రధానాంశంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. నాజర్‌, జగపతిబాబు, నరేశ్‌, రావురమేశ్‌ కీలకపాత్రలు పోషించారు. రీతూవర్మ, ఐశ్వర్యా రాజేశ్‌ కథానాయికలు. షైన్‌ స్క్రీన్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్‌ స్వరాలు అందించారు. కాగా, తాజాగా విడుదలైన ఈ పాటకు గోపీసుందర్‌ స్వరాలు అందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని