Updated : 31 Oct 2021 13:28 IST

Unstoppable: అదరగొట్టేలా బాలయ్య ‘అన్‌స్టాపబుల్‌’ ప్రోమో

ఇల్లు అమ్మేశాను.. బాధగా ఉంది: మోహన్‌బాబు

హైదరాబాద్‌: ‘‘అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవరు ఆపుతారో చూద్దాం’’ అని అంటున్నారు అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ. తొలిసారిగా ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌’. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ‘ఆహా’ వేదికగా నవంబర్‌ 4 నుంచి ఇది ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘అన్‌స్టాపబుల్‌’ మొదటి ఎపిసోడ్‌ ప్రోమోని ‘ఆహా’ విడుదల చేసింది. సీనియర్‌ నటుడు మోహన్‌బాబు అతిథిగా సాగిన ఈ ఎపిసోడ్‌లో బాలయ్య తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. కెరీర్‌లో చూసిన ఎత్తుపల్లాలతోపాటు ఎన్నో వ్యక్తిగత, రాజకీయ విషయాలపై మోహన్‌బాబు తన అనుభవాలను షేర్‌ చేసుకున్నారు.

ఇందులో భాగంగా ఓ రౌండ్‌లో ‘‘మీరు నటించిన చిత్రాల్లో అస్సలు చూసుకోలేని చిత్రమేది?’’ అని బాలకృష్ణ ప్రశ్నించగా.. ‘‘పటాలం పాండు’’ అని మోహన్‌బాబు సమాధానం చెప్పగానే.. ‘‘సినిమా ఫ్లాప్‌ అయ్యిందా’’ అంటూ బాలయ్య నవ్వులు పూయించారు. ‘‘హీరోగా నిలబడాలనే ప్రయత్నం విఫలమవుతున్న రోజుల్లో మీరు ఎప్పుడైనా బాధపడ్డారా?’’ అని బాలయ్య ప్రశ్నించడంతో.. మోహన్‌బాబు ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ‘‘తలుచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు వస్తుంటాయి. నా బిడ్డలకు అన్యాయం చేస్తున్నట్లు అనిపించింది. కష్టాలు ఎదుర్కోవడం కోసం ఆరోజుల్లో మేం ఉంటున్న ఇంటిని కూడా అమ్మేశాను. నాకు ఎవ్వరూ సాయం చేయలేదు’’ అంటూ మోహన్‌బాబు భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు ఈ షోలో మంచు లక్ష్మి, విష్ణు సైతం సరదాగా సందడి చేశారు. బాలయ్యతో కలిసి ఆడిపాడారు. ఈ ఫుల్‌ ఎనర్జిటిక్‌, ఎంటర్‌టైనింగ్‌ ఎపిసోడ్‌ చూడాలంటే దీపావళి వరకూ వేచి ఉండాల్సిందే.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని