Tollywood: త‘లుక్కు’న మెరిసారు

అగ్ర తారల చిత్రాలే కాదు... పరిమిత వ్యయంతో రూపొందుతున్న యువతరం తారల సినిమాలూ జనవరి 1న ప్రత్యేక ప్రచారంతో సందడి చేశాయి.

Updated : 02 Jan 2022 07:07 IST

అగ్ర తారల చిత్రాలే కాదు... పరిమిత వ్యయంతో రూపొందుతున్న యువతరం తారల సినిమాలూ జనవరి 1న ప్రత్యేక ప్రచారంతో సందడి చేశాయి.

18 పేజీస్‌: నిఖిల్‌ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కథతో రూపొందుతున్న చిత్రం ‘18 పేజీస్‌’. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. పల్నాటి సూర్యప్రతాప్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాసు నిర్మాత. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమాని ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. శనివారం కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు.


హైవే: యువ కథానాయకుడు ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ‘హైవే’ సినిమా కొత్త పోస్టర్‌ని శనివారం విడుదల చేశారు. కె.వి.గుహన్‌ దర్శకత్వంలో సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. మానస రాధాకృష్ణన్‌ కథానాయిక. వెంకట్‌ తలారి నిర్మాత. అభిషేక్‌ బెనర్జీ, సయామీ ఖేర్‌, సత్య, జాన్‌ విజయ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని  త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.



హను - మాన్‌: తేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘హను - మాన్‌’ పోస్టర్‌ని శనివారం విడుదల చేసింది ఆ చిత్రబృందం.


105 మినిట్స్‌: హన్సిక ప్రధాన పాత్రధారిగా... ఒకే ఒక్క పాత్రతో ప్రయోగాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘105 మినిట్స్‌’. రాజు దుస్సా దర్శకత్వం వహిస్తున్నారు. బొమ్మక్‌ శివ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కొత్త పోస్టర్‌ని శనివారం విడుదల చేశారు. సింగిల్‌ షాట్‌, సింగిల్‌ క్యారెక్టర్‌ చిత్రంగా తొలిసారి భారతీయ తెరపై కొస్తున్న సినిమా ఇదని, హన్సిక నటన   ఆకట్టుకునేలా ఉంటుందని సినీ వర్గాలు తెలిపాయి. సామ్‌.సి.యస్‌ సంగీతం అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని