
Bangarraju: ‘వాసివాడి తస్సాదియ్యా’.. ఫరియా ప్రత్యేక గీతం అదిరిందయా!
ఇంటర్నెట్ డెస్క్: అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. ‘జాతిరత్నాలు’ ఫేం ఫరియా అబ్దుల్లా ఓ ప్రత్యేక గీతంలో కనిపించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. వారి నిరీక్షణకు తెరదించుతూ ఆదివారం ఆ గీతాన్ని విడుదల చేసింది. ‘వాసివాడి తస్సాదియ్యా’ అంటూ సాగే ఈ గీతం అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేలా ఉంది. ఒకే ఫ్రేమ్‌లో నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, ఫరియా కనువిందు చేస్తున్నారు. దర్శకుడు కల్యాణ్ కృష్ణ రచించిన ఈ హుషారైన గీతాన్ని మోహన భోగరాజు, సాహితి చాగంటి, హర్ష వర్థన్ ఆలపించారు. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చారు. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. గతంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి స్క్రీన్‌ప్లే: సత్యానంద్, కళ: బ్రహ్మ కడలి, కూర్పు: విజయ్ వర్థన్.
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.