Updated : 19 Jan 2022 06:51 IST

Cinema News: మార్పు తీసుకురావడమే లక్ష్యంగా..

‘‘భ్రూణ హత్యల కారణంగా అమ్మాయిల సంఖ్య తగ్గితే.. తలెత్తే పరిణామాలేంటన్నది సందేశాత్మకంగా చూపించే చిత్రమే మా ‘వధుకట్నం’’ అన్నారు భార్గవ గొట్టిముక్కల. ఆయన దర్శకత్వంలో శ్రీహర్ష హీరోగా తెరకెక్కించిన చిత్రమే ‘వధుకట్నం’. షేక్‌బాబు సాహేబ్‌ నిర్మించారు. ప్రియా శ్రీనివాస్‌, కవిత శ్రీరంగం, అనన్య నాయికలు. ఈ సినిమా ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘పుట్టబోయేది ఆడపిల్ల అని తెలియగానే చాలా మంది అబార్షన్‌ చేయించుకుంటున్నారు. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తులో పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరక్క ఎదురుకట్నం ఇవ్వాల్సి వస్తుంది. ఈ అంశాన్నే ఈ చిత్రంలో వినోదాత్మక చూపించాం. ప్రస్తుత సమాజంలో అమ్మాయిల పట్ల చూపుతున్న వివక్షను దీంట్లో లోతుగా చర్చించాం. నిర్మాత షేక్‌బాబు ఆలోచన నుంచి పుట్టిన కథ ఇది’’ అన్నారు. ‘‘సమాజంలో మార్పు తీసుకురావాలనే మంచి లక్ష్యంతో ఈ సినిమా నిర్మించా. యువతరాన్ని మెప్పించే అన్ని రకాల వాణిజ్య హంగులు ఇందులో ఉన్నాయి. బడ్జెట్‌ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించామ’’న్నారు నిర్మాత షేక్‌బాబు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని