Valimai: బైక్‌పై నుంచి జారిన అజిత్‌.. కళ్లు చెదిరేలా ‘వాలిమై’ విన్యాసాలు!

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు అజిత్‌ నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘వాలిమై’. హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Published : 15 Dec 2021 01:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ ప్రముఖ నటుడు అజిత్‌ నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘వాలిమై’. హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం చిత్ర బృందం ఎంత కష్టపడిందో తెలియజేసే వీడియో విడుదలైంది. కొవిడ్‌కి ముందు, తర్వాత పరిస్థితిని చూపిస్తూ తీర్చిదిద్దిన ఈ మేకింగ్‌ వీడియో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. తాము పోషిస్తున్న పాత్రల కోసం అజిత్‌, కార్తికేయ పడిన శ్రమని ఇందులో చూడొచ్చు. ఒకానొక సందర్భంలో బైక్‌ స్టంట్స్‌ చేస్తుండగా అజిత్‌ జారిపడ్డారు. అయినా దాన్ని లెక్కచేయకుండా ముందుకుసాగారు. ఆ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. జీ స్టూడియోస్‌, బోనీ కపూర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కార్తికేయ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. హ్యుమా ఖురేషి కథానాయిక. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2022 సంక్రాంతి కానుకగా విడుదలకానుంది.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని