NBK 107: బాలయ్య సినిమాలో ‘క్రాక్‌’ జయమ్మ

గతేడాది విడుదలైన ‘క్రాక్‌’తో సూపర్‌హిట్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు దర్శకుడు గోపీచంద్‌ మలినేని (Gopichand Malineni). ప్రస్తుతం ఆయన బాలకృష్ణతో ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని పట్టాలెక్కించారు.....

Published : 05 Jan 2022 13:21 IST

హైదరాబాద్‌: ‘క్రాక్‌’తో సూపర్‌హిట్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు దర్శకుడు గోపీచంద్‌ మలినేని (Gopichand Malineni). ప్రస్తుతం ఆయన బాలకృష్ణతో ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని పట్టాలెక్కించనున్నారు. త్వరలో రెగ్యూలర్‌ షూట్‌ ప్రారంభించనున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఓ కీలక పాత్రలో నటించనున్నారని చిత్రబృందం బుధవారం అధికారికంగా స్పష్టం చేసింది. టీమ్‌లోకి ఆమెకు స్వాగతం పలుకుతూ ట్వీట్‌ చేసింది. మరోవైపు, ‘క్రాక్‌’లో జయమ్మగా వరలక్ష్మి (Varalakshmi) నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. వాస్తవిక ఘటనలు ఆధారంగా చేసుకుని ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో బాలయ్య సరసన శ్రుతి హాసన్‌ సందడి చేయనున్నారు. కన్నడ నటుడు దునియా విజయ్‌ ఈ సినిమాలో మరో కీలకపాత్రలో కనిపించనున్నారు.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని