Varsha: జబర్దస్త్‌ వర్షను చూసి పరుగులు తీసిన స్థానికులు

ఈటీవీలో ప్రసారమవుతున్న ‘జబర్దస్త్‌’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ ప్రోగ్రామ్‌లతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు నటి వర్ష. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని....

Updated : 12 Sep 2021 04:20 IST

హైదరాబాద్‌: ఈటీవీలో ప్రసారమవుతున్న ‘జబర్దస్త్‌’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ ప్రోగ్రామ్‌లతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు నటి వర్ష. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈటీవీలో ప్రసారమైన ‘ఊరిలో వినాయకుడు’ కార్యక్రమంలో ఆమె రోజా టీమ్‌లో సభ్యురాలిగా పాల్గొన్నారు. ఈవెంట్‌లో భాగంగా ‘మారువేషం ధరించి జనసమూహాల్లోకి వెళ్లి ఎవరికైనా ప్రపోజ్‌ చేసి.. వాళ్లతో ఓకే అనిపించుకోవాలి?’ అని వర్షకు రామ్‌ప్రసాద్‌ టాస్క్‌ విసురుతారు. టాస్క్ చేయడానికి ఓకే చెప్పిన వర్ష ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఉండేలా సిద్ధమై.. నగరంలోని పలు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్దకు వెళ్లి భిక్షాటన చేస్తూ కనిపించారు. అంతేకాకుండా కనిపించిన వాళ్లందర్నీ.. పలకరిస్తూ ఉన్నారు. దీంతో ఆమెను చూసిన పలువురు స్థానికులు రోడ్లపై పరుగులు తీశారు. మరోవైపు, వర్ష చేస్తోన్న టాస్క్‌ చెడగొట్టేందుకు ఇమ్మాన్యుయేల్‌ సైతం యాచకుడిగా రోడ్లపై కనిపించారు. అటుగా ఓ వెళ్తున్న ఓ మహిళను.. ధర్మం చేయమంటూ వెంటపడటం.. ఆమె వెంటనే పోలీస్‌ అని కేకలు వేయడం నవ్వులు పూయించింది. ఈ సరదా టాస్క్‌కు సంబంధించిన ఫుల్‌ వీడియో చూసేయండి..!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని