Varun Sandesh: కష్టానికి ప్రతిఫలం దక్కింది

వరుణ్‌ సందేశ్‌, ఫర్నాజ్‌ శెట్టి జంటగా ఎంఎస్‌ఆర్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఇందువదన’. మాధవి ఆదుర్తి నిర్మాత. శివ కాకాని స్వరాలందించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ  నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ నిర్వహించారు.

Updated : 07 Dec 2022 22:32 IST

వరుణ్‌ సందేశ్‌, ఫర్నాజ్‌ శెట్టి జంటగా ఎంఎస్‌ఆర్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఇందువదన’. మాధవి ఆదుర్తి నిర్మాత. శివ కాకాని స్వరాలందించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ  నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో వరుణ్‌ మాట్లాడుతూ.. ‘‘నేను ఐదేళ్ల తర్వాత చేసిన ఈ చిత్రం ఎలా ఉంటోందో అనుకున్నా. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. ఎంఎస్‌ఆర్‌ సినిమాని బాగా తీశారు. మురళి అద్భుతమైన విజువల్స్‌ ఇచ్చారు. గిరిజన యువతిగా ఫర్నాజ్‌ చక్కగా నటించింది. నాకిలాంటి మంచి చిత్రమిచ్చినందుకు దర్శక నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘మా కష్టానికి ప్రేక్షకులు మంచి ప్రతి ఫలాన్ని అందించార’’న్నారు దర్శక నిర్మాతలు. ఈ కార్యక్రమంలో ఫర్నాజ్‌, సందీప్‌, జ్యోతి, పార్వతీశం, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని