Varun Tej: రానున్న రోజుల్లో ఆ భేదం ఉండదు: వరుణ్‌ తేజ్‌

సంగీత్‌ శోభన్‌ ప్రధాన పాత్రలో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’. సిమ్రన్‌ శర్మ కథానాయిక.

Updated : 21 Nov 2022 15:02 IST

హైదరాబాద్‌: సంగీత్‌ శోభన్‌ ప్రధాన పాత్రలో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’. సిమ్రన్‌ శర్మ కథానాయిక. మహేశ్‌ ఉప్పాల దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ని పింక్‌ ఎలిఫెంట్స్‌ పిక్చర్స్‌ పతాకంపై నిహారిక నిర్మించారు. ఓటీటీ ‘జీ5’లో నవంబర్‌ 19 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో గురువారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. నటుడు వరుణ్‌ తేజ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

వేడుకను ఉద్దేశించి వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ..‘నిహారిక ఎప్పుడూ తనదైన దారిలో పయనించాలనుకుంటుంది. తన సినిమాలకి సంబంధించిన నిర్ణయాలన్నీ తనే తీసుకుంటుంది. తన పనిలో మా ప్రయేయం ఉండదు. సంవత్సరం క్రితం ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నా అని చెప్పింది. అదే ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’. చిత్రీకరణ పూర్తయ్యాక ట్రైలర్‌ చూపించింది. చూడగానే నేను సర్‌ప్రైజ్‌ అయ్యాను. నాకు చాలా బాగా నచ్చింది. ఇది సిరీస్‌లా కాదు సినిమా స్థాయిలో ఉందని చాలామంది అంటున్నారు. భవిష్యత్తులో ఓటీటీ (వెబ్‌ సిరీస్‌), సినిమా అనే భేదం ఉండదు. సినిమాల వల్ల కొంతమంది అవకాశం వస్తే వెబ్‌ సిరీస్‌ల వల్ల చాలా మందికి అవకాశం లభిస్తుంది. సంగీత్‌ శోభన్‌ అద్భుతంగా నటించాడు. ఈ సిరీస్‌ విడుదలయ్యాక అతడికి చాలా మంచి పేరొస్తుంది. సంగీతం బాగుంది. నరేశ్‌లాంటి సీనియర్‌ నటులు సినిమాల్లోనే కాకుండా సిరీస్‌ల్లోనూ నటించి, కొత్తవారికి ప్రోత్సాహం అందిస్తున్నారు. ఈ సిరీస్‌కి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆల్‌ ది బెస్ట్‌’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నరేశ్‌, నిహారిక, సంగీత్‌, సిమ్రన్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని