Katrina-Vicky: కంగనకు స్పెషల్‌ గిఫ్ట్‌ పంపిన కత్రినా-విక్కీ

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌కు బీటౌన్‌ కొత్త జంట కత్రినాకైఫ్‌, విక్కీ కౌశల్‌ స్పెషల్‌ గిఫ్ట్ బాక్స్‌ పంపించారు. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వైరస్‌ కలవరపాటుకు గురిచేస్తోన్న తరుణంలో అతి తక్కువ మంది కుటుంబసభ్యులు...

Updated : 12 Dec 2021 14:01 IST

ముంబయి: బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌కు బీటౌన్‌ కొత్త జంట కత్రినాకైఫ్‌, విక్కీ కౌశల్‌ స్పెషల్‌ గిఫ్ట్ బాక్స్‌ పంపించారు. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వైరస్‌ కలవరపాటుకు గురిచేస్తోన్న తరుణంలో అతి తక్కువ మంది కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెళ్లికి ఆహ్వానించని సినీ తారలందరికీ ఈ జంట ఇప్పుడు స్పెషల్‌ గిఫ్ట్‌లు పంపిస్తోంది. ఇందులో భాగంగా కంగనాకు గిఫ్ట్ బాక్స్‌ అందింది. ఈవిషయాన్ని తెలియజేస్తూ కంగన.. ‘‘సువాసనతో కూడిన పువ్వులు, రుచికరమైన నేతి లడ్డూలు పంపించినందుకు థ్యాంక్యూ విక్కీ-కత్రినా. కంగ్రాట్స్‌’’ అని పోస్ట్‌ చేసింది.

అతిథులకు పంజాబీ వంటల రుచి..!

పెళ్లికి వెళ్లిన అతిథులకూ విక్కీ-కత్రినా జంట రిటర్న్‌ గిఫ్ట్‌లు ఇచ్చింది. అతిథులు విడిది చేసిన రూమ్స్‌లో ముందుగానే ఈ గిఫ్ట్‌ బాక్సులు పెట్టించారు. అందులో నాలుగు రకాల పంజాబీ స్వీట్స్‌, థ్యాంక్యూ లెటర్‌ కూడా ఉంచారు. ‘‘మా ఆహ్వానాన్ని మన్నించి సుదూర ప్రయాణం చేసి మా పెళ్లి వేడుకల్లో భాగమైన మీ అందరికీ ధన్యవాదాలు. మా జీవితంలో ఎంతో విలువైన ఈ వేడుకల్లో మీరు కూడా భాగం కావడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది’’ అని ఈ జంట పేర్కొంది. మరోవైపు, వివాహమైన అనంతరం ఈ జంట హనీమూన్‌ కోసం విదేశాలకు వెళ్లినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని