Updated : 17 Nov 2021 07:36 IST

Liger: అగ్గి రాజేస్తారు

కరికొకరు ఎదురుపడ్డారు... ఇక తలపడటమే ఆలస్యం అంటోంది ‘లైగర్‌’ బృందం. బాక్సింగ్‌ దిగ్గజం మైక్‌ టైసన్‌ని ఢీ కొట్టేందుకు లైగర్‌ బరిలోకి దిగుతున్నాడు. మరి ఆ పోరు ఎలా సాగుతుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఎదురు చూడాల్సిందే. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘లైగర్‌’. అనన్య పాండే కథానాయిక. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. పూరి జగన్నాథ్‌, ఛార్మి కౌర్‌, కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతా నిర్మాతలు. ఇందులో బాక్సింగ్‌ యోధుడు మైక్‌ టైసన్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్‌ దేవరకొండ, టైసన్‌లపై తెరకెక్కించాల్సిన సన్నివేశాల కోసం ఇటీవలే   అమెరికా వెళ్లారు. అక్కడ చిత్రీకరణ మొదలైందని చెబుతూ, విజయ్‌ దేవరకొండ, మైక్‌ టైసన్‌ కలిసి నవ్వులు చిందిస్తున్న ఫొటోని పంచుకుంది చిత్రబృందం. ఇద్దరూ బాక్సింగ్‌ బరిలోకి దిగి అగ్గి రాజేస్తారని, ఆ సన్నివేశాలు అంచనాల్ని మించి ఉండనున్నాయని సినీ వర్గాలు తెలిపాయి. ఈ పోరాట ఘట్టాల్ని యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ కెచ్చా నేతృత్వంలో తెరకెక్కిస్తున్నారు. ‘‘మైక్‌ టైసన్‌తో కలిసి గడిపే ప్రతీ క్షణాన్నీ ఆస్వాదిస్తున్నా. ఆ జ్ఞాపకాలు నాకు ఎప్పటికీ ప్రత్యేకమే’’ అని ట్వీట్‌ చేశారు విజయ్‌ దేవరకొండ. రమ్యకృష్ణ, రోనిత్‌రాయ్‌, విష్ణురెడ్డి, అలీ, మకరంద్‌ దేశ్‌పాండే, గెటప్‌ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ప్రథమార్థంలో తెలుగుతోపాటు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని