Vijay Deverakonda: ‘లైగర్‌’ మొదలెట్టాడు.. అంచనాలు పెంచుతున్నాడు!

‘లైగర్‌’ సినిమా చిత్రీకరణ పునః ప్రారంభమైంది. విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది.

Published : 15 Sep 2021 14:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: యువ నటుడు విజయ్‌ దేవరకొండ హీరోగా పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లైగర్‌’. సాలా క్రాస్‌ బ్రీడ్‌ అనేది ఉపశీర్షిక. బుధవారం కొత్త షెడ్యూల్‌ ప్రారంభమైందని చిత్ర బృందం తెలియజేసింది. ఈ మేరకు షూటింగ్‌ స్పాట్‌లో ఉన్న విజయ్‌ దేవరకొండ ఫొటోని విడుదల చేసింది. ఇందులో విజయ్‌ పొడవాటి జుత్తుతో ఠీవిగా వెనక్కి తిరిగి కూర్చొని కనిపించాడు. చొక్కా లేకుండా బాక్సింగ్ బరిలోకి దిగిన సన్నివేశంలా అనిపిస్తుంది. ‘రక్తం.. చెమట.. హింస’ అంటూ ఈ ఫొటోకి విజయ్‌ క్యాప్షన్‌ ఇచ్చాడు. ఒక్క లుక్‌తోనే సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు. విజయ్‌తోపాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ సరసన బాలీవుడ్‌ భామ అనన్య పాండే నటిస్తోంది. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కోసం విజయ్‌ మిక్స్‌డ్ మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తయింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని