Vijay Sethupathi: ‘లాభం’ లుక్ విడుదల చేసిన బాబీ
‘లాభం’ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేసిన దర్శకుడు బాబీ. విజయ్ సేతుపతి హీరోగా రూపొందిన చిత్రమిది.
ఇంటర్నెట్ డెస్క్: విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘లాభం’. తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబరు 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఫస్ట్‌లుక్‌ని టాలీవుడ్ యువ దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ) విడుదల చేశారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ.. ‘విజయ్ సేతుపతి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యారు. డబ్బింగ్ సినిమాలతో విశేషంగా అలరించిన ఆయన ‘సైరా’, ‘ఉప్పెన’ చిత్రాలతో తెలుగు వారిని నేరుగా పలకరించారు. ఈ సినిమాలోని ఆయన లుక్ చాలా బాగుంది. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాతలకు అభినందనలు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సినీ రచయిత కోన వెంకట్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి.వై, చిత్ర నిర్మాత బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీశ్), సమర్పకుడు లాయర్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. విజయ్ సేతుపతి ఈ సినిమాలో రైతు సమస్యలపై పోరాడే వ్యక్తిగా కనిపించనున్నారు. జగపతి బాబు ప్రతినాయకుడి పాత్ర పోషించారు. సాయి ధన్సిక కీలక పాత్రలో సందడి చేయనుంది. ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
PM Modi: వారి ప్రవర్తన బాధాకరం.. విపక్షాలు విసిరే బురదలోనూ ‘కమలం’ వికసిస్తుంది: మోదీ
-
Movies News
Ott Movies: ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/ వెబ్‌సిరీస్‌లు
-
Sports News
IND vs AUS: రవీంద్రజాలంలో ఆసీస్ విలవిల.. 200లోపే ఆలౌట్
-
World News
Bill Gates: మళ్లీ ప్రేమలో పడిన బిల్‌గేట్స్..?
-
Movies News
Janhvi Kapoor: వాళ్ల సూటిపోటి మాటలతో బాధపడ్డా: జాన్వీకపూర్
-
Politics News
Nara Lokesh - Yuvagalam: మరోసారి అడ్డుకున్న పోలీసులు.. స్టూల్‌పైనే నిల్చుని నిరసన తెలిపిన లోకేశ్